మీరు సంతోషంగా లేరా..... అయితే ఈ పనిచేయండి - MicTv.in - Telugu News
mictv telugu

మీరు సంతోషంగా లేరా….. అయితే ఈ పనిచేయండి

August 25, 2017

మీరు ఆనందంగా లేరా.. అయితే ఇట్లా చేయండి తప్పకుండా సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో ఇది మిస్ కాకుండా చూసుకుంటే తప్పకుండా హ్యాపీగా ఉంటారు. అడుగు అడుగులో ఆనందం ఉంటుందట నడిస్తే. నడక పై అమెరికాకు చెందిన పరిశోధకులు స్టడీ చేశారు.

జనాలు ఈ మధ్య కాలంలోనడవటం అంటేనే నమోషీగా ఫీల్ అవుతున్నారు లేదా… అంత శ్రమ అవసరమా అనుకుంటున్నారు. అందుకే లేని రోగాలు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు నడిచే వ్యవధి కూడా జనాలకు ఉండటం లేదు. పొద్దు, మాపు ఒకటే పని ఉంటుంది. కాబట్టి నడగ గురించి  అస్సలు పట్టించుకోవడం లేదు.

అయితే కొంత మంది విద్యార్థులపై  పరిశోధకులు ప్రయోగాలు చేశారు. నడచి వచ్చిన వారి ఆనందం, కూచుని వీడియోలు చూసిన వారి పరిస్థితిని స్టడీ చేశారు. కూచున్న వారి కంటే నడిచిన వారే చాలా సంతోషంగా ఉన్నారట.

అంటే నడక వలన మనుష్యుల్లో ఉండే  చాలా అంశాలు బాడీ పై ప్రభావం చూపిస్తాయట. అందుకే రోజూ ఓనాలుగు అడుగులు అటు తీసి ఇటు వేయండి సంతోషంగా జీవించండి.