Waltair Veerayya box office collection Day 1
mictv telugu

తొలిరోజే హాఫ్ సెంచరీ.. వీరయ్య వీరంగం

January 14, 2023

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిరంజీవి వాల్తేరు వీరయ్య నిన్న జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వగా.. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. రవితేజ, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఈ మెగా మాస్ మూవీ బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించేసింది. వీరసింహారెడ్డికి పోటీగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర నందమూరి బాలకృష్ణని బీట్ చేసినట్టు తెలుస్తుంది. కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ వాల్తేరు వీరయ్య చిత్రం శుక్రవారం తొలిరోజే రికార్డు స్థాయిలో 29 కోట్ల రూపాయలు షేర్స్ వసూలు చేసినట్టు సమాచారం.

2022లో విడుదలైన చిరంజీవి గాడ్‌ఫాదర్ కంటే వాల్తేరు వీరయ్య బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కొల్లగొట్టింది. గాడ్ ఫాదర్ మొదటి రోజు రూ. 12.97 కోట్ల రికార్డుని తుడిచేసింది వాల్తేరు వీరయ్య. ఇక అందరినీ ఆకట్టుకుంటున్న ‘వాల్తేరు వీరయ్య’.. తొలిరోజు వరల్డ్ వైడ్ రూ.55 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. నైజాంలో రూ.6.10 కోట్లు, సీడెడ్ లో రూ.4.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.60 కోట్లు, ఈస్ట్ లో రూ.2.68 కోట్లు,
వెస్ట్ లో రూ.2.06 కోట్లు, కృష్ణాలో రూ.1.49 కోట్లు, గుంటూరులో రూ.2.76 కోట్లు, నెల్లూరులో రూ.1.05 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇలా తొలిరోజే హాఫ్ సెంచరీ మార్క్ క్రాస్ చేసిన చిరు సినిమా.. ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తోంది.