బిగ్ స్క్రీన్ పై మెగాస్టార్ ని యాక్షన్ అవతార్‌లో చూడటం అభిమానులకు ఎల్లప్పుడూ ఒక ట్రీట్. సరైన కమర్షియక్ అంశాలతో చిరంజీవి వచ్చినప్పుడల్లా ఆడియన్స్ భారీ సంఖ్యలో థియేటర్లకు వస్తారు. ఆరుపదుల వయసులో కూడా చిరంజీవి సినిమాకి ప్రేక్షకులు క్యూ కడుతుండటం గమనార్హం. రజినీకాంత్ తరువాత మాస్ ఇమేజ్ లో మెగాస్టారే అని చెప్పొచ్చు. మొన్న సంక్రాంతికి జనవరి 13న థియేటర్లలోకి వచ్చిన వాల్తేర్ వీరయ్య 6వ రోజు బాక్సాఫీస్ వద్ద నిలకడగా నిలవటమే కాకుండా ప్రభంజనం దిశగా అడుగులేస్తోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం వాల్టెయిర్ వీరయ్య 6వ రోజున కూడా ఎక్కడ తగ్గలేదు. పండగ సెలవులు అయిపోయినా జనాలు వీరయ్య షోకి క్యూ కడుతున్నారు.
ఆరవ రోజు కూడా వీరయ్య రూ.9.25 కోట్లను కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. KS రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి నుండి గట్టి పోటీని ఎదుర్కొంటు విడుదలైన 5వ రోజున 100 కోట్ల క్లబ్లో చేరి.. మరికొద్ది రోజుల్లో డబుల్ హండ్రెడ్ దిశగా పరుగులు పెడుతుంది. మెగాస్టార్ వాల్తేరు వీరయ్య ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 157.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 121.35 కోట్లు వచ్చాయి. అమెరికాలోనూ ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ల (రూ.16 కోట్లు) మార్కెట్ అందుకుంది. ఈ ఏడాది ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుత జోరు చూస్తుంటే ఈ వారంతంలోనే మెగాస్టార్ చిత్రం రూ. 200 కోట్ల మార్కు దాటేలా ఉంది.