waltair veerayya censor report
mictv telugu

వీరయ్య వీక్.. ఆశలన్నీ ఆ 40ని. ఎపిసోడ్ పైనే ?

January 4, 2023

మెగాస్టార్ సంక్రాంతి గిఫ్ట్ వాల్తేరు వీరయ్య మూవీ విడుదల సమయం దగ్గరపడుతుండటంతో క్షణక్షణం ఫ్యాన్స్ లో ఉత్కంఠత పెరుగుతుంది. బాస్ పార్టీ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ తో మొదలైన క్రేజ్ రోజురోజుకి పెరుగుతూ.. పూనకాలు లోడింగ్ పాటతో మరోస్థాయికి చేరింది. రవితేజ, చిరంజీవి కలిసి చిందేసిన ఈ పూనకాలు పాట మాస్ ని షేక్ చేసి పడేస్తుంది. ఇంతలో మెగా ఫ్యాన్స్ కోసం మరో సంచలన వార్త సిద్ధమైపోయింది. తాజాగా వాల్తేరు వీరయ్య మూవీ సెన్సార్ పూర్తయినట్టు తెలుస్తుంది. సర్టిఫికెట్ తో పాటు వీరయ్య టాక్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ టాక్ లీక్స్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌తో లోడ్ అయినట్టు తెలుస్తుంది.

 

అయితే మొన్న మెగాస్టార్ చెప్పినట్లుగా ఇది చాలా రొటీన్ అయినప్పటికీ వినోదాత్మకంగా ఉన్నట్టు సెన్సార్ సభ్యలు అభిప్రాయమాట. ఇక మరో ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ పార్ట్ ఆకట్టుకుంటుందని.. సెకండాఫ్‌లో రవితేజ ఎంటర్ అవ్వగానే సినిమా గతి మారిపోతుందని.. దాదాపు మాస్ మహారాజ ఉన్న 40 నిమిషాల ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. ఇక సెకండాఫ్‌లో చిరంజీవి, రవితేజల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయని.. రెండు పాటల పిక్చరైజేషన్ సూపర్ అని టాక్. ఇక ఫైనల్ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం.. ఇది కొత్తదనం లేని రొటీన్ సినిమా అయినప్పటికీ సంక్రాంతి సీజన్‌ కాబట్టి గట్టెక్కొచ్చని అంటున్నారు. రవితేజ ఎపిసోడ్ జనాలకు కనెక్ట్ అయితే ఇది పక్క హిట్ అవుతుందని అంటున్నారు.