Waltair Veerayya Controversy : Yandamuri Sensational Comments On Mega Star Waltair Veerayya Title Song
mictv telugu

అర్ధం పర్ధం లేకుండా ఉంది.

December 29, 2022

yandamoori veerendranath post about waltair veerayya title song

తెలుగు సినిమా పాటలు….వీటి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చును. హంగులకు ప్రాధాన్య ఇచ్చే తెలుగు పాట్లలో లిరికల్ వాల్యూ తగ్గిపోయి చాలా రోజులే అయింది. మంచి సాహిత్యం ఉన్న పాటలు మహా అయితే వేళ్ళ మీదనే లెక్క పెట్టవచ్చును. పెద్ద పెద్ద రచయితలుగా పేరున్న వారు కూడా చెత్త సాహిత్యం రాసిన సందర్భాలున్నాయి. వేటూరి లాంటి వారు ఎంత అద్బుతంగా రాస్తారో అంతే అర్ధం పర్ధం లేకుండా, బూతులు రాసిన పాటలు కోకొల్లలు. కాకపోతే అవీ ఇవీ సమానంగా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. కానీ వేటూరి, సీతారామశాస్త్రి తర్వాత వచ్చిన లిరికల్ రైటర్స్ లో అబ్బో వీళ్ళు చాలా సూపర్ అనే వాళ్ళు ఒక్కరూ లేరు. విపరీతమైన పేరున్న చంద్రబోసూ ఇందుకు అతీతుడు కాడు.

పదాల అర్ధం కన్నా సౌండ్ కి, బరువుకి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడం తెలుగు పాటలకున్న మరో దరిద్రం. ఈ మధ్య సినిమాల్లో ఇది మరీ ఎక్కువైపోయింది. హీరో ఎలివేషన్ అంటూ ఓ సాంగ్ పెట్టడం, అందులో బరువైన పదాలు వాడేయడం చేస్తున్నారు. అయితే అవి ఎందుకు పెడుతున్నారో లిరిక్ రైటర్ కూ తెలియదు, మిగతా వాళ్ళ గురించి అయితే అసలు మాట్లాడుకోనక్కర్లేదు కూడా. అది ఆర్భాటంగా ఉందా లేదా అని మాత్రమే చూసుకుంటున్నారు. ఇప్పడు తాజాగా వచ్చిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవి ఎలివేషన్ పాట మళ్ళీ ఇలాంటి టాపిక్ కి తెర తీసింది. ఈ మధ్యనే రిలీజక అయిన ఈ పాట…ప్రాసలతో, పదాల హంగామాతో, ఎనర్జిటిక్ మ్యూజిక్ తో ఉంది. కానీ సరిగ్గా వింటే, తెలుగును పట్టించుకునే వాళ్ళు అయితే ఆ పాట ఎంత అర్ధం పర్దం లేకుండా ఉందో తెలుస్తుంది. చిరంజీవికి అత్యంత ఆత్మీయుడు అయిన యండమూరి వీరేంద్రనాథే ఈ పాటను బండబూతులు తిడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు, ఆ పాట ెంత చిరాగ్గా ఉందో.

“భగ భగ భగ భగ మండే.. మగ మగ మగ మగ మగాడురే వీడే.. జగ జగ జగ జగ జగ చెడు జగాన్ని చెండాడే.. ధగ ధగ ధగ ధగ ధగ జ్వలించు సూరీడే.. అగాధగాథల అనంత లోతుల సముద్ర సొదరుడే వీడే.. వినాశకారుల స్మశానమౌతాడే.. తుఫాను అంచున తపస్సు చేసే.. వశిష్ఠుడంటే అది వీడే.. తలల్ని తీసే.. విశిష్టుడే వీడే.. వీరయ్య”…..ఇదీ చిరంజీవి ఎలివేషన్ సాంగ్. చంద్రబోస్ రాసాడు దీన్ని. బాబు ఓవరాక్షన్ చేయంటే తెగ చేస్తాడు కానీ, తాను రాసిన పాటలకు అర్ధాలు మాత్రం చూసుకోడు. అందుకే ఈ పాట మీద అసహనం వ్యక్తం చేశారు యండమూరి.

ఈ పాటలో ఒకచోట తుఫాను అంచున తపస్సు చేసే వశిష్ఠుడే వీడే … తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే ! అని వస్తుంది. వ్రాసిన వారు ఎవరో కానీ అసలు అతడెందుకు వ్రాశాడు అతనికి ఏ సంప్రదాయం తెలుసు ? ఏ పురాణకధలు చదివాడు ? తిమిరము అంటే అర్ధం తెలుసా నీకు?.. త్రినేత్రుడు అనగా శివమహాదేవుడు ! ఆయన తిమిరనేత్రము అనగా చీకటి కన్నుగా కలిగినవాడు ,లేదా రోగమున్న కన్నుకలవాడు ! ఏ అర్ధం తీసుకున్నా అది శివదూషణే ! .. ఇక ఏ తుఫాను అంచున వశిష్టమహర్షి తపస్సు చేశారో చెప్పు నాయనా ? .. తెలుసా తెలియదా ? ఏమిటీ పిచ్చిరాతలు ? తెలుగు సినీ కవిత్వం వేటూరి మరణంతో మసకబారిన దీపమయ్యింది సిరివెన్నెల మరణం ఆ కాస్త దీపాన్ని ఆర్పేసింది !” అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

యండమూరి పోస్ట్ వైరల్ అయింది. దీని మీద నెటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. మరి చంద్రబోస్ ఏం సమాధానం చెబుతారో దీనికి.

ఇవి కూడా చదవండి : 

మరో వివాదంలో రష్మిక.. సౌత్ ఇండస్ట్రీపై వెగటు కామెంట్స్

రాధిక నుంచి నాగలక్ష్మి వరకు….