Waltair Veerayya Movie Review In Telugu | megastar chiranjeevi
mictv telugu

వాల్తేరు వీరయ్య తొలి రివ్యూ!

January 11, 2023

మెగాస్టార్ చిరంజీవి, రవితేజలు హీరోలుగా తొలిసారి స్క్రీన్‌ షేర్ చేసుకున్న చిత్రం వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న థియేటర్లలో విడుదలకి సిద్ధమైంది. సంక్రాంతి సీజన్ ఒకవైపు, బాలయ్య మరోవైపు ఉండటంతో ఈ సారి తీవ్ర పోటీ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో వీరయ్యపై భారీ బజ్ నెలకొంది. ఇప్పటికే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల ట్రైలర్స్, మ్యూజిక్ ఆడియన్స్‌లో భారీ హైప్‌ని క్రియేట్ చేయగా.. మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాల టాక్ కూడా బయటికొస్తోంది. ఇప్పటికే వీరసింహారెడ్డి సూపర్ హిట్ అంటూ రివ్యూ బయటకి రాగా.. వాల్తేరు వీరయ్య తోలి రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ టు టాలీవుడ్ అన్ని భారీ చిత్రాల విడుదల ముందే రివ్యూలు ఇస్తూ.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా, సినీ విమర్శకుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు వాల్తేరు వీరయ్య చిత్రానికి రివ్యూ ఇచ్చేశాడు. దుబాయ్ లో సెన్సార్ బోర్డు ఆఫీసులో చిత్రాలని చూసి చెప్తానంటూ చెప్పే ఉమైర్ సంధు మాటలు ఎంతవరకు నిజమో కానీ తన రివ్యూలకి మాత్రం సపరేట్ క్రేజ్ ఉంటుంది.
అన్ని మీడియా సంస్థలు ఇతనికి ప్రిఫరెన్స్ ఇస్తాయి. ఈ నేపథ్యంలో ఉమైర్ సంధు వీరయ్య బ్లాక్ బస్టర్ అని సంచలన రివ్యూ చెప్పాడు. మొన్న వీరసింహారెడ్డికి 3.5రేటింగ్ ఇచ్చి సూపర్ హిట్ అని చెప్పగా.. నేడు వాల్తేరు వీరయ్యకి కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమా చిరంజీవికి బెస్ట్ కమ్‌బ్యాక్ అని కొనియాడాడు. రవితేజ, చిరంజీవి కాంబో అదిరిపోయిందని.. ఇద్దరూ కలిసి వెండితెరపై అద్భుతం చేశారని పేర్కొన్నాడు. ఇదొక మసాలా పాప్‌కార్న్ మూవీ అని అన్నాడు. సినిమాకు మంచి కథ, సంగీతం కుదిరాయని చెప్పుకొచ్చాడు. అలాగే, ఈ సినిమాకు 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు ఉమైర్ సంధు. అయితే చాలాసార్లు ఉమైర్ సంధు రివ్యూలు రివర్స్ అయ్యాయి కూడా. సినిమా సూపర్ అని ఉమైర్ సంధు అంటే డిజాస్టర్ అయిన సందర్భాలు.. అట్టర్ ఫ్లాప్ అంటే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఉండటంతో.. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల రివ్యూస్ ని లైట్ తీసుకుంటున్నారు నెటిజన్స్. కానీ మెగా నందమూరి అభిమానులు మాత్రం ఉమైర్ సంధు ట్వీట్‌ని తెగ వైరల్ చేస్తున్నారు.