ఎప్పటినుండో ఊరిస్తున్న వాల్తేర్ వీరయ్య – పూనకాలు లోడింగ్ పాట విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి మాస్ స్టెప్స్ తో దుమ్ముదులపాగా.. మాస్ మహారాజ స్పెషల్ ఎంట్రీ పిచ్చెక్కిస్తుంది. చిత్ర యూనిట్ ప్రకటించినట్టుగానే ఈ రోజు సాయంత్రం 6గంటలకు యూట్యూబ్ లో విడుదలవ్వగా.. అర గంటలోనే 3లక్షల వ్యూస్ కొల్లగొట్టింది. వీరయ్య పూనకాలు లోడింగ్ అసలు సిసలు డాన్స్ నంబర్ అంటూ క్రియేట్ అయిన హైప్ ని నిజం చేస్తూ మెగా మాస్ కాంబో అదరగొట్టింది.
ఇక బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ రాగా.. ఇప్పుడు ఈ పూనకాలు లోడింగ్ నాలుగో పాట ట్రెండ్ చూస్తే.. ఇప్పటికే ఉన్న అన్ని యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టి మెగా మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుందని అంటున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ కు జోడీగా అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.