waltair veerayya veera simha reddy movies fight
mictv telugu

సీమలో రెడ్డి క్లీన్ స్వీప్.. ఆంధ్రలో వీరయ్య వీరంగం

November 30, 2022

2023 సంక్రాంతి మెగా నందమూరి అభిమానులకి నిజమైన పండగ. ఒకవైపు కోళ్ల పందాల సంబరాలు చేసుకుంటూనే మరోవైపు థియేటర్లలో భారీ సందడి ఖాయంగా కనిపిస్తుంది. చాలా సంవత్సరాల తరువాత వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో బాక్సాఫీస్ దెగ్గర అసలు సిసలు పోటీ నెలకొంది. చిరంజీవి, బాలకృష్ణల చిత్రాలు ఒకేసారి సంక్రాంతి సీజన్ లో విడుదలవుతుండటం సంచలనంగా మారుతుంది. బయట మేమిద్దరం మంచి మిత్రులమని చెప్తున్నా.. చిరంజీవి, బాలయ్యల మధ్య పోటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఈ ఇద్దరు దిగ్గజాలు ఎన్నోసార్లు బాక్సాఫీస్ వార్ కి దిగారు. ఓవర్ ఆల్ గా బాలకృష్ణపై మెగాస్టార్ చిరంజీవి కాస్త ఆధిపత్యం చెలాయించినా..సంక్రాంతి యుద్ధంలో మాత్రం బాలయ్యతో పోటీ అంటే వార్ వన్ సైడ్ అయిపోతుంది. సంక్రాంతి సీజన్ లో బాలయ్య ట్రాక్ రికార్డు అలాంటిది. అందుకే బాలయ్యని సంక్రాంతి బుల్లోడు అని కూడా అంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి పక్కాగా తన సినిమా ఉండేలా ప్రణాళికలు రచిస్తారు బాలయ్య. అఖండ మాస్ హిట్ తో బాలయ్య మంచి ఫార్మ్ లో ఉంటే.. ఆచార్య, గాడ్ ఫాదర్ చిత్రాలకు ఆశించిన ఫలితాలు రాకపోవటంతో నిరాశలో ఉన్న చిరంజీవి వాల్తేరు వీరయ్యపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.

దాంతో మెగా నందమూరి అభిమానుల్లో ఈ రెండు చిత్రాలపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. ఏ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుంది, ఏ చిత్రానికి ఎన్ని థియేటర్లు కేటాయిస్తారు వంటి లెక్కలన్నీ అపుడే మొదలైపోయాయి. అయితే వీరిద్దరి పోటీలో విజేత ఎవరన్నది మాత్రం నైజం ఏరియా లెక్కలు తేల్చనున్నట్టు చెప్తున్నారు క్రిటిక్స్. బాలకృష్ణకి సహజంగానే సీడెడ్ లో మంచి మార్కెట్ ఉంటుంది. ఇక వీరసింహారెడ్డి వంటి ఫ్యాక్షన్ సినిమాలకు సీమలో బాలయ్య అభిమానులు బ్రహ్మరథం పడతారు. కనుక వీర సింహారెడ్డి సంక్రాంతికి సీడెడ్ లో క్లీన్ స్వీప్ చేస్తాడు అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాతో ఆంధ్రా ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి దుమ్ము రేపడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో నైజాం ఏరియాలో పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. నైజాం ఏరియాలో ఈ రెండు సినిమాలకు కూడా థియేటర్లు సమానంగా దక్కుతాయా లేదా అనేది క్లారిటీ లేదు. ఒకవేళ సమానంగా దొరుకుతే చిరంజీవి, బాలకృష్ణల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. అయితే హైదరాబద్ వంటి అర్బన్, టౌన్ ఏరియాల్లో మెగా డామినేషన్ ఉండే అవకాశాలుంటే.. రూరల్ థియేటర్స్ లో బాలకృష్ణ దూసుకెళ్లొచ్చన్న అంచనాలు వస్తున్నాయి. కనుక నైజాం లోనే ఈ రెండు సినిమాల యొక్క ఫలితం పై అందరి దృష్టి ఉంది.