2023 సంక్రాంతి పండుగ హడావిడి అంత థియేటర్స్ లోనే కనపడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల వ్యవధిలో చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు గ్రాండ్ రిలీజ్ అయ్యాయి. మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య సహజంగా ఉండే కోల్డ్ వార్ ఒకవైపు, సంక్రాంతికి చాలారోజుల తరువాత వీరిద్దరు తలపడుతుండటం మరోవైపు.. ఈ రెండు కారణాలతో భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో మొన్న జనవరి 12న విడుదలైన వీరసింహారెడ్డి చిత్రం.. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రం మొదటి రోజే 52 కోట్ల గ్రాస్, 24కోట్ల షేర్స్ వసూల్ చేసి 2023ని గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఇక నెక్స్ట్ డే జనవరి 13న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య విడుదలై సంచలనమే సృష్టించింది. బాలయ్య లాంటి మాస్ హీరో ప్రభంజనాన్ని తట్టుకుని మరి పరుగులు పెడుతున్నాడు వీరయ్య. ఈ సినిమా మొదటి రోజు రూ.55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వీరసింహారెడ్డిపై స్వల్ప ఆధిక్యాన్ని కనపరిచింది. దీంతో చిరంజీవి బాలకృష్ణలలో సంక్రాంతి విజేత ఎవరన్నది ఉత్కంఠంగా మారింది.
మాస్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన వీరసింహారెడ్డికి మొదటి రోజు కలెక్షన్స్ బాగానే వచ్చినా.. రెండవ రోజు పూర్తిగా పడిపోయి కేవలం 5కోట్లు మాత్రమే వసూల్ చేసింది. వాల్తేరు వీరయ్య దెబ్బకు వీరసింహారెడ్డి కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయినట్టు తెలుస్తుంది. అయితే నందమూరి అభిమానులకి ఈ చిత్రం భాగానే కనెక్ట్ అయినా కామన్ ఆడియన్స్ ని మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందని అంటున్నారు. మరోవైపు వాల్తేరు వీరయ్య బెటర్ అనే అభిప్రాయం వినిపిస్తుంది. మూస కథాంశం ఉన్నా.. మాస్, క్లాస్ కి నచ్చేలా చిరంజీవి కామెడీ వాల్తేరు వీరయ్యని నిలబెట్టేలా కనిపిస్తుందని.. లాంగ్ రన్ లో వీరయ్య బాలయ్యపై డామినేషన్ చేసే అవకాశాలు ఉన్నట్టు అంచనాలు వస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతి రేసులో పోటీ పడుతున్న కోలీవుడ్ స్టార్స్ విజయ్ వారసుడు, అజిత్ తెగింపు చిత్రాలు తెచ్చుకోవటంతో చిరు బాలయ్యలకి పోటీ ఇచ్చే అవకాశాలు లేనట్టేనని అంటున్నారు. ఈ నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ విన్నర్ గా చిరంజీవి బాలయ్యలో ఎవరో ఒకరే నిలిచే అవకాశం ఉంది. మరి ప్రేక్షకులు ఆ అవకాశం ఎవరికి ఇస్తారనేది వేచి చూడాలి.