Wanna know you should move to based on your zodiac sign?
mictv telugu

ఏ రాశికి.. ఏ దేశం?!

November 14, 2022

మీ రాశి ఏది? దాని బట్టి మీరు భారతదేశం కాకుండా ఏ దేశం వెళితే బాగా ఎంజాయ్ చేస్తారో తెలుసుకోవాలనుందా? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే వారి మూడ్‌ని బట్టి, వారి అవలంబించే పద్ధతులను బట్టి ఆ దేశంలో హాయిగా బతికేస్తారో ఓ లుక్కేయండి ముందు. ఆ తర్వాత వివరంగా ఆ దేశాల్లో మీరు ఎలా ఇమిడి పోతారో కూడా చదవండి. ఇది సరదాకు మాత్రమే అని మాత్రం మరచిపోకండి.


బాక్స్
మేషం _ న్యూజిలాండ్
వృషభం _ ఆస్ట్రేలియా
మిథునం _ సౌత్ కొరియా
కర్కాటకం _ కెనడా
సింహ _ స్పెయిన్
కన్య _ సింగపూర్
తుల _ ఫ్రాన్స్
వృశ్చికం _ ఐస్‌ల్యాండ్
ధనుస్సు _ ఇండోనేషియా
మకరం _ యూనైటెడ్ కింగ్డమ్
కుంభం _ జపాన్
మీనం _ ఇటలీ
మీరు ఏ దేశంలో ఉంటే బాగుంటారో చూసుకోండి.
మేషం
ఈ రాశి వారు సాహస ప్రేమికులు. న్యూజిల్యాండ్‌లో సాహసాలు చేయడానికి అనువైన ప్రదేశం. పైగా సంస్కృతికి నిలయం ఈ ప్రదేశం. కాబట్టి మేషరాశి వారు ఈ స్థలంలో బాగా ఎంజాయ్ చేస్తారు. సరదా కార్యకలాపాలు చేయడానికి, యాక్టివ్ లైఫ్ స్టయిల్లో బతుకుడానికి న్యూజిల్యాండ్ బాగుంటుంది.
వృషభం
భూమికి సంకేతం వృషభం. ఈ రాశి ఐదు ఇంద్రియాలచే పాలించబడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి సహజ సౌందర్యం, మంచి ఆహారం, నిర్మలమైన ఆకాశం ఉన్న ప్రదేశాలు నచ్చుతాయి. అందుకే ఆస్ట్రేలియా వీరు ఉండేందుకు బాగుంటుంది. మంచి బీచ్‌లు, జంతువులతో రోజులు ఆహ్లాదంగా గడిచిపోతాయి.
మిథునం
ప్రతిరోజు కొత్తదనం కోరుకుంటారు ఈ రాశివాళ్లు. అందుకే వీరికి సౌత్‌కొరియా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా కొరియాలోని సియోల్ నగరం వీరికి సరైన ప్రదేశం. కొత్త భాష, మ్యూజిక్, ఫ్యాషన్ ట్రెండ్స్, కొత్త సంప్రదాయాలకు ఈ నగరం నెలవు. కాబట్టి వీరు ఈ నగరంలో ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు.
కర్కాటకం
వీరికి భద్రత ఉన్న ప్రాంతాలు నచ్చుతాయి. అందులో మొదటిస్థానంలో ఉండేది కెనడా. ఇక్కడకి ఈ రాశి వారు ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎలాంటి సమస్యలు తలెత్తవు. పైగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా దొరుకుతాయి. అందుకే ఈ ప్రాంతం కర్కాటక రాశి వారి చెక్ లిస్ట్ ప్రదేశంలో కెనడా తప్పక ఉంటుంది.
సింహ
ఫ్యాషన్, పార్టీలు, పబ్ కల్చర్ ఈ రాశి వారికి బాగా నచ్చుతుంది. కాబట్టి వీరికి స్పెయిన్ కరెక్ట్ డెస్టినేషన్. ఈ దేశంలో వీరు చాలా సంతోషంగా ఉంటారు. పైగా ఇక్కడ ఫుట్‌బాల్, చాలా నృత్య రూపాకాలకు కూడా ఈ దేశం పెట్టింది పేరు. వివిధ రకాల ఆర్కిటెక్చర్ కూడా ఇక్కడ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
కన్య
ఈ రాశి వారికి ఏదైనా శుభ్రంగా ఉండాలి. అందుకే సింగపూర్ వీరికి నచ్చుతుంది. ఇక్కడ ఉండే రూల్స్, శుభ్రత మరెక్కడా కనిపించదంటే అతిశయోక్తి కాదేమో! అంతేకాదు.. ఇక్కడ చూడడానికి కూడా చాలా ప్రదేశాలు మిమ్మల్ని కట్టిపడేయడం ఖాయం. కెరీర్‌పరంగా కూడా చాలా అవకాశాలు ఇక్కడ ఈ రాశి వారికి దొరుకుతాయి.
తుల
నాగరికతను ఈ రాశి వారు ఇష్టపడుతారు, కాబట్టి వీరి బెస్ట్ డెస్టినేషన్ ఫ్రాన్స్. ఫ్యాన్సీ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్ వారికి కరెక్ట్ చాయిస్. ఈఫిల్ టవర్ వెలుగుల్లో లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలంటే ఈ ప్రాంతం బాగుంటుంది. ఈ రాశుల్లో కొందరికి ప్రకృతి అంటే మక్కువ. వారికి కూడా ఈ ప్రాంతం బాగా నచ్చుతుంది.
వృశ్చికం
చలి చాలామందికి పెద్దగా పడదు. అలాంటి ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయపడతారు. కానీ ఈ రాశి వారికి ఐస్‌ల్యాండ్ బెస్ట్ ప్లేస్. పైగా అడ్వేంచర్లు చేయడానికి కూడా ఈ ప్రాంతాలు బాగుంటాయి. ఈ రాశి వారికి పచ్చని విశాలమైన భూమలపై కూడా మక్కువ. ప్రశాంత జీవనం గడుపడానికి ఎక్కువ ఇష్టపడుతారు.
ధనుస్సు
ఈ రాశి వారు దైనందిన జీవితం నుంచి, కష్టాల నుంచి తప్పించుకోవడానికి ప్రయాణాలు చేస్తుంటారు. వీరికి ఇండోనేషియా మంచి ఆహ్లాద వాతావరణాన్ని ఇస్తుంది. బాలీ, కొమొడో, గిల్లి ఐల్యాండ్లు వీరికి మంచి వీకెండ్ ప్లేసెస్. దట్టమైన అడవుల్లో వీరి తమ జీవితాన్ని తప్పక ఎంజాయ్ చేస్తారు.
మకరం
కళలు, చరిత్ర కలిగిన ప్రాంతాలను వీరు ఇష్టపడుతారు. కాబట్టి యునైటెడ్ కింగ్డమ్ వీరి డెస్టినేషన్. లండన్‌లో వీరు కావాల్సిన వాటిని నేర్చుకోవడానికి ఇది అనువైన స్థలం. కొత్త సంస్కృతులను నేర్చుకోవడానికి కూడా ఈ ప్రదేశం మీకు తప్పక నచ్చుతుంది.
కుంభం
కొత్త పుంతలను బాగా ఇష్టపడే తత్వం వీళ్లది. అందుకే కొత్త ఆవిష్కరణలు జరిగే జపాన్ వీరికి కరెక్ట్ ప్లేస్. కొత్త టెక్నాలజీలు, ఆర్కిటెక్చర్ ప్లానింగ్ కూడా వీరికి బాగా నచ్చుతుంది. పైగా వీరికి పని చేయడం కూడా బాగా ఇష్టం. ఇక్కడ వీరికి మంచి పని కూడా దొరుకుతుంది.
మీనం
ఇటలీ.. అందమైన ద్రాక్షతోటలు, గ్రామాలతో నిండి ఉంటుంది. మీన రాశి వారికి ఫుడ్, ఫుట్‌బాల్, వైన్ అంటే తెగ ఇష్టపడుతారు. ఈ ప్రాంతంలో ఇవి బాగా దొరుకుతాయి. కాబట్టి స్వేచ్ఛగా బతికేస్తారు. పైగా ఇక్కడ చూసే ప్రదేశాలు కూడా అధికం. అందుకే రోడ్ ట్రిప్ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు.