వాట్సాప్ కు వాన్నా క్రై ముప్పు... - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ కు వాన్నా క్రై ముప్పు…

May 17, 2017

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వాన్నాక్రై వైరస్ ముప్పు సోషల్ మీడియాకు పొంచిఉంది. ఈ వైరస్ ఎఫెక్ట్ తో ఇప్పటికే అనేక కంప్యూటర్లు లాక్ అయ్యాయి. అయినప్పటికీ ఇంకా ఈ ర్యాన్సమ్‌వేర్ దాడి కొనసాగుతూనే ఉంది. భారత్‌లోనూ ఈ వైరస్ ప్రభావం ఎక్కువైంది. అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఈ ర్యాన్సమ్‌వేర్ వ్యాప్తి చెందినట్టు తెలిసింది. ఈ ర్యాన్సమ్‌వేర్ వైరస్ అక్కడితో ఆగడం లేదు. వాట్సాప్ యూజర్లకూ దీని ద్వారా ముప్పు పొంచి ఉంది.

ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ప్లాట్‌ఫాంలపై వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లకు ఇప్పుడు ఓ మెసేజ్ వైరల్‌లా వస్తోంది. ”వాట్సాప్ కామన్ గా గ్రీన్ కలర్ స్కిన్‌తో ఉంటుంది, ఈ కలర్ కాకుండా ఇంకా రెడ్, బ్లూ, ఎల్లో రంగుల్లోనూ వాట్సాప్ వచ్చింది, దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఓ లింక్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది…” అని ఆ మెసేజ్‌లో ఉంటుంది. దీనికి తోడు ఓ మాల్‌వేర్ లింక్ కూడా ఆ మెసేజ్‌లో కనిపిస్తోంది. ఈ క్రమంలో సహజంగానే ఆ ఫీచర్ కు అట్రాక్ట్ అయిన యూజర్లు ఆ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. అలా లింక్ క్లిక్ చేయగానే ఆ యూజర్ ఉన్న వాట్సాప్ గ్రూప్‌లు అన్నింటిలోనూ ఆ మెసేజ్ యూజర్‌కు తెలియకుండానే పోస్ట్ అవుతోంది. దీంతో చాలా మందికి ఆ మెసేజ్ వైరల్ అవుతోంది. ఆ తరువాత పనికి రాని యాడ్‌వేర్ యాప్స్ అన్నీ ఫోన్‌లలో వాటంతట అవే ఇన్‌స్టాల్ అవుతున్నాయి. దీంతో వైరస్ ఫోన్లలో విస్తరించి డివైస్‌లను పనికిరాకుండా చేస్తోంది. అచ్చం వాన్నక్రై వైరస్‌ను పోలి ఉండడంతో ఇది అదేనా..? లేక వేరే ఎవరైనా కొత్తగా వైరస్‌ను సృష్టించారా..? అన్న సందేహాలు సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ నిపుణులకు వస్తున్నాయి.

http://шһатѕарр.com పేరిట ఆ లింక్ ఉంది. అది ఒరిజినల్ వాట్సాప్ లింక్ అనుకుని చాలా మంది ఆ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. నిజానికి ఈ సైట్ నకిలీది. ఈ లింక్‌లో ఉండే ш అనే సింబల్ ఇంగ్లిష్ అక్షరం W ను పోలి ఉంటుంది. కనుకనే దానికి తేడా గుర్తించలేక చాలా మంది వాట్సాప్ యూజర్లు ఈ నకిలీ సైట్ బారిన పడ్డారు.

సో మీరు కూడా ఇలాంటి నకిలీ లింక్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వాట్సాప్‌లో కనిపించే ప్రతి లింక్‌ను ఓపెన్ చేసే ముందు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. లేదంటే మీరూ బాధితుల లిస్టులోకి ఎక్కుతారు.

HACK:

  • Social Media especially Whatsapp is effected by Wannacry Ransomware.
  • Experts says that it is safe to verify before opening any link.