ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో బ్రహ్మాండమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. తన జియో ఫోన్ నెక్స్ట్ పై సరికొత్త ఎక్స్చేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలో స్మార్ట్ఫోన్లకు దూరంగా ఉన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆఫర్ తీసుకొచ్చింది. గత ఏడాదిఅక్టోబర్‌లో విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 6,499 కాగా, ఎక్స్చేంజ్ ఆఫర్‌పై రూ.2 వేల తగ్గింపుతో రూ. 4,499కే అందిస్తున్నట్టు ప్రకటించింది. పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులు ఏదైనా వర్కింగ్‌లో ఉన్న 4జీ స్మార్ట్‌ఫోన్, లేదంటే 4జీ ఫీచర్ ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్చేంజ్ చేసుకునేందుకు పాత ఫోన్ లేకుంటే మాత్రం రూ. 6,499 చెల్లించాల్సి ఉంటుంది.
మొత్తం ఒకేసారి చెల్లించి తీసుకోలేనివారు ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజుతో కలిసి తొలుత రూ. 2,500 చెల్లించి ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగతా మొత్తాన్ని 18/24 నెలల్లో సులభ వాయిదాల్లో చెల్లించొచ్చు.
ఫీచర్లు ఇవే..
5.45 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్.. 2జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజీకి మద్దతిస్తుంది. ఇక మెమొరీని 512 జీబీ వరకు విస్తరించుకునే సదుపాయం ఉంది. డ్యుయల్ సిమ్, స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్ ప్రాసెసర్, వెనుకాల 13 MP, ముందు 8 MP ఆటో ఫోకస్ కెమెరాలు, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులోని స్పెషల్ ఫీచర్లు. ఈ ఫోన్ ప్రగతి ఓఎస్‌తో పనిచేస్తుంది.