Want to do a multistarrer with Allu Arjun, Ram Charan , says Allu Aravind
mictv telugu

‘చరణ్ – అర్జున్’ – మల్టీస్టారర్ టైటిల్ రివీల్.. అల్లు అరవింద్ పదేళ్ల కల

October 18, 2022
చిరంజీవి ఛరిష్మాతో మెగా ఫ్యామిలీ నుండి ఎంతమంది హీరోలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినా.. వీరందరికి వెనుక ఉండేది మాత్రం అల్లు అరవింద్. మాస్టర్ మైండ్‌గా పేరున్న ఈయన సలహాలు, సూచనలను మెగా హీరోలు పాటిస్తుంటారు. చిరంజీవి సైతం అప్పటి నుండి ఇప్పటి వరకు అల్లు అరవింద్ సలహాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారని టాక్. అల్లు, మెగా బంధం ఇంతా స్ట్రాంగ్ ఉన్నా ఈ కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందంటూ గాసిప్స్ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య ఈగో క్లాష్ ఉందని అంటుంటారు. ఇలాంటి వాటికి అల్లు అరవింద్ మొన్నటి ‘ఆలీతో సరదాగా’ అనే షోలో క్లారిటీ ఇచ్చేశాడు.
బయట ఏవేవో అనుకున్నా మెగా ఫ్యామిలీతో అల్లు వారి బంధం ఎప్పటికి చెరగనిది అని చెప్పేశారు. మొన్న తాజాగా జరిగిన అల్లు రామలింగయ్య 100వ జన్మదిన వేడుకల్లో కూడా ఇరు కుటుంబాలు పాల్గొన్న తీరు దీనికి నిదర్శనంగా చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో రామ్ చరణ్ – అల్లు అర్జున్‌ల మల్టీస్టారర్ ఎప్పటికైనా ఉంటుందని మెగా అల్లు ఫ్యాన్స్‌కి గట్టి నమ్మకాన్ని ఇచ్చే వార్త ఒకటి చెప్పారు అరవింద్. “‘ఆడియెన్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఎలా ఉంటుందో నాకు తెలియ‌దు కానీ.. నాకొక కోరిక ఉంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ వర్కౌట్ చేయాలనీ నాకు ఒక కల. గీతా ఆర్ట్స్‌లో వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బావుంటుంది. ఈ మ‌ల్టీస్టార్ కాంబినేష‌న్‌కి ప‌దేళ్ల క్రితం నేను చ‌ర‌ణ్ – అర్జున్ అనే టైటిల్‌ను ఎప్పుడో రిజిష్ట‌ర్ చేశాను. ఆ టైటిల్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్‌ను రెన్యువ‌ల్ చేస్తూనే ఉన్నాను. ఎప్ప‌టికైనా జ‌రుగుతుంద‌నే నా న‌మ్మ‌కం’’ అన్నారు. మరి కథలను వింటున్నారా! అని ప్ర‌శ్నించ‌గా.. లేదు ఇంకా ప్రారంభించ‌లేదు అని స‌మాధానం ఇచ్చారు అరవింద్ .