Want to do romantic movies for relief : Amalapal
mictv telugu

రిలీఫ్ కోసం రొమాంటిక్ సినిమాలు చేయాలనుకుంటున్నా : అమలాపాల్

August 10, 2022

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అమలాపాల్ కెరీర్ మంచిగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంది. తర్వాత ఆ బంధంలో వచ్చిన విభేదాల వల్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లో నటిస్తోంది. నటించడమే కాక, నిర్మాతగా కూడా మారింది. తాజాగా ఆమె నటించి నిర్మించిన కడావర్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 12న డైరెక్టుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ సందర్భంగా అమలాపాల్ మీడియాతో మాట్లాడుతూ.. తన చిత్రాన్ని అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నించారని ఆరోపించింది. ఎంతో కష్టపడి తీసిన సినిమాను విడుదల చేయనీయకుండా తెర వెనుక కుట్ర చేశారని చెప్పింది. కథ బాగున్నందుకే ఈ సినిమా నిర్మాణంలో భాగం అయ్యానని ఈ క్రమంలో తన తల్లి, సోదరుడు ఎంతో సహకరించారని పేర్కొంది. అలాగే వరుసగా క్రైమ్, హారర్ చిత్రాలు చేసి బోర్ కొట్టిందని, ఇక నుంచి రిలీఫ్ కోసం రొమాంటిక్ చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది.