‘హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి’ - MicTv.in - Telugu News
mictv telugu

‘హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలి’

October 26, 2022

హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అయితే చూడాలనుందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం బీజాపూర్‌లో ప్రచారం నిర్వహించిన ఓవైసీ.. ఈ నెల 28న జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు వార్డుల్లో పోటీ చేస్తోందని చెప్పారు. ఇదే సందర్భంలో హిజాబ్ గురించి ప్రస్తావిస్తూ.. హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

 

ముస్లింలు తినే మాంసం, ధరించే టోపీలు, గడ్డాలను కొందరు బీజేపీ నేతలు ప్రమాదకారకాలుగా చూస్తున్నారని, ముస్లిం ఆహారపు అలవాట్లతో వారికి సమస్య ఉందన్నారు. ముస్లిం గుర్తింపుకు ఆ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. భారతదేశ వైవిధ్యాన్ని, ముస్లిం గుర్తింపును అంతం చేయడమే బీజేపీ అసలు ఎజెండా అని ఆయన ఆరోపించారు. సబ్కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే ప్రధానమంత్రి మాటలన్నీ ఉత్తవేనని చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఈ వ్యాఖ్యలపై ఒవైసీ విరుచుకుపడ్డారు.