అల్లు - మెగా ఫ్యాన్స్ మధ్య వార్.. ఏం పీకలేరు బ్రదర్ - MicTv.in - Telugu News
mictv telugu

అల్లు – మెగా ఫ్యాన్స్ మధ్య వార్.. ఏం పీకలేరు బ్రదర్

May 24, 2022

అల్లు అర్జున్ అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి కుటుంబ హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. తిట్లు, దూషణలతో ఏం పీకలేరు బ్రదర్ అనే పదంతో విరుచుకుపడుతున్నారు. అంతేకాక, అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మిగతా హీరోలైన ప్రభాస్, మహేష్, నందమూరి అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అసలేమైందంటే.. ఇటీవల విజయవాడలో మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్లు ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో అల్లు అర్జున్ ఫోటో వేయలేదు. దీంతో ఆగ్రహించిన అల్లు అర్జున్ అభిమానులు మా హీరో ఫోటో ఎందుకు వేయలేదని సమావేశంలో నిలదీశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. అల్లు అర్జున్ ఫోటో వేయలేదంటే మెగా ఫ్యామిలీ నుంచి ఆయనను వేరు చేసినట్టేనన్న భావన మొదలైంది. చివరికి అల్లు అర్జున్‌కి తర్వాతి చిత్రమే చివరి చిత్రమని మెగా ఫ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు అనడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. చివరికి ఈ గొడవ సోషల్ మీడియా వరకు పాకింది. అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా ‘ఏం పీకలేరు బ్రదర్’ అనే మీమ్స్ ఎక్కువయ్యాయి. అంతేకాక, మెగా ఫ్యాన్స్‌ని మినహాయిస్తే మిగతా హీరోల అభిమానులు తమకు అండగా ఉన్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి అభిమానుల మధ్య మొదలైన ఈ విభజనపై మెగా, అల్లు కుటుంబాల హీరోలు, నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.