యుద్ధం దెబ్బ.. భారీగా పెరిగిన సిలిండర్ ధర - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం దెబ్బ.. భారీగా పెరిగిన సిలిండర్ ధర

March 1, 2022

gas

కరోనా కారణంగా రెండు సంవత్సరాలపాటు దేశ ప్రజలు ఆర్థికంగా అనేక అవస్థలు పడిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా కరోనా తగ్గుముఖం పడడంతో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే పలు సంస్థలు ధరలు పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు గట్టి షాక్‌ ఇచ్చాయి. ఏకంగా రూ.105 పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢీల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఏకంగా రూ.2 వేలు దాటింది. ఇక 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను కూడా రూ.27 పెంచాయి. పెంచిన కొత్త ధరలు మంగళవారం (ఈరోజు) నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపాయి.

పెరిగిన ధరల ప్రకారం..

1. ఢీల్లీలో రూ.2,012
2. కలకత్తాలో రూ. 2,089
3. ముంబైలో రూ. 1,962
4. చెన్నైలో రూ. 2,185.5

ఇక 5 కేజీల వాణిజ్య సిలిండర్ ధర ఢీల్లీలో రూ. 569కి చేరింది. కాగా, ఫిబ్రవరి 1వ తేదీన రూ. 91.50 తగ్గించి, మంగళవారం (ఈరోజు) రూ.105 పెంచాయి. మరోపక్క డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో చమురు సంస్థలు ఈ నెలలో కూడా ఎలాంటి మార్పులు చేయకపోవడం కాస్త ఊరటనిస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం 14.2 కిలోల సిలిండర్ ధర..

1. ఢీల్లీ, ముంబైలో రూ. 899.5.
2. కలకత్తాలో రూ.926
3. చెన్నైలో రూ. 915.5
4. హైదరాబాద్‌లో రూ. 952గా ఉన్నాయి.