యుద్ధం ఎఫెక్ట్.. వంట నూనెకు రెక్కలు - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం ఎఫెక్ట్.. వంట నూనెకు రెక్కలు

February 25, 2022

nune

రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధరలకు 100 డాలర్లకు చేరుకుంది. దీంతో భారతదేశంలో కూడా ముడి చమురు ధరలు కూడా త్వరలోనే పెరగనున్నాయి.

ఇందులో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌, ఆయిల్ కంపెనీలు ధరలను రూ.15 వరకు పెంచనున్నాయని సమాచారం. ఈ పెంపును రెండు లేదా మూడు దశలలో ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాక, ఎల్‌పీజీ, సీఎన్‌జీ ధరలు కూడా వచ్చే కొన్ని రోజుల్లో రూ.10 నుంచి రూ.15 వరకు పెరగనున్నాయని సమాచారం.

యుద్ధం ప్రభావం భారత్‌లో కూడా కనిపిస్తుంది. వంట నూనెకు రెక్కలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరుకు రూ.136 ఉన్నా లీటర్ ప్యాకెట్ ధర ప్రస్తుతం 150 దాకా పలుకుతుంది. అయితే సన్‌ప్లవర్‌ ఆయిల్ గతంలో భారత్ 1.89 మిలియన్‌ టన్నులను దిగుమతి చేసుకుంది. 70 శాతం ఉక్రెయిన్‌, 20 శాతం రష్యా నుంచి వచ్చింది. మరో 10 శాతం ఆర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకుంది. అయితే ఇటీవలే ఉక్రెయిన్‌ నుంచి సరఫరా నిలిచిపోయింది. ఇంకొన్ని రోజులు యుద్ధం ఇలాగే కొనసాగితే, భారత్‌కు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల వివరాలు..

1. లీటర్ నూనె ధర: 150
2. పెట్రోల్ ధర:108.20
3. డీజీల్ ధర:94.62
4. ఎల్‌పీజీ:952
5.సీఎన్‌జీ:69
4. బంగారం ధర: 46,850