యుద్ధం వల్ల తప్పట్లేదు : నెట్‌ఫ్లిక్స్ - MicTv.in - Telugu News
mictv telugu

యుద్ధం వల్ల తప్పట్లేదు : నెట్‌ఫ్లిక్స్

March 17, 2022

gggxdc

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాపై అనేక దేశాలతో పాటు దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలను రష్యాలో నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో రష్యాను ఇబ్బంది పెట్టవచ్చని భావించారు కానీ, తామే చాలా వరకు నష్టపోతామని తెలియలేదు. ఇప్పుడా ఫలితాన్ని ప్రముఖ ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ అనుభవిస్తోంది. యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో కంపెనీ ఆదాయం భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇప్పటికే ఉన్న వినియోగదారులపై భారం మోపనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్ చెంగి లాంగ్ ప్రకటించారు. ఇప్పటివరకు వినియోగదారుడు తమ ప్రీమియం అకౌంట్లను ఫ్రీగా షేర్ చేసే సదుపాయం ఉండేది. దీంతో ఒక అకౌంట్‌తో కుటుంబసభ్యులందరూ వీడియోలను చూసేవారు. కానీ ఇప్పుడు వాటికి రుసుము చెల్లించాలి. అకౌంట్లను షేర్ చేస్తే రెండు నుంచి మూడు డాలర్ల వరకు చెల్లించాలి. ఈ మేరకు ఫీచర్‌పై ప్రత్యేకంగా పని చేస్తున్నామని చెంగిలాంగ్ వెల్లడించారు.