వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. శనివారం ఉదయం బండ్ల గణేశ్ ట్వీట్‌తో మొదలైన ఈ యుద్ధం సాయంత్రం దాకా నాన్ స్టాప్‌గా కొనసాగుతూనే ఉంది. మొదటగా బండ్ల గణేశ్ ”అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్బాజీవి. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్‌కి జనం కారం పెట్టడం ఖాయం విజయసాయి” అంటూ ట్విట్ చేసిన విషయం తెలిసిందే.
వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకో వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుటుంది. నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 16, 2022
వెంటనే స్పందించిన విజయసాయి రెడ్డి ”వెన్నుపోటు పేటెంటు నీ యజమాని చంద్రబాబుది. 28 ఏళ్లుగా చెక్కు చెదరని గిన్నెస్ రికార్డు. ఇంకో వందేళ్లయినా అది బాబు పేరనే ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా బండ్లా? ప్రతి కుక్కా సింహం కావాలనుకుటుంది. నీలాంటి వాడే భౌ..భౌమని మొరిగి గర్జించా అనుకుని మురిసిపోతుంటాడు” బండ్లకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
దీనికి రీకౌంటర్‌గా బండ్ల గణేశ్.. ”ఫోన్లు పగలడం, లాజిక్కులు చేయడం, సినిమాలు తీయడం తప్పు కాదు దొంగ సాయి. దేశాన్ని దోచుకోవడం, స్కాములు చేయడం, తప్పు పనులు చేయడం దొంగ పని సాయి” అంటూ కౌంటర్ ఇచ్చారు.