war of words between nagababu and naresh
mictv telugu

నువ్వో పెద్ద బేవార్స్.. నువ్వొక పనికి మాలినోడివి.. పొట్టుపొట్టు తిట్టుకున్న నరేష్ – నాగబాబులు

October 31, 2022

తెలుగు చిత్ర పరిశ్రమలో పలు వివాదాల్లో నటుడు నరేష్ పేరు ఎప్పుడు నానుతూనే ఉంటుంది. మా ఎన్నికలు కావొచ్చు, వరుస పెళ్లిళ్లు అవ్వొచ్చు.. తాజాగా నటి పవిత్ర లోకేష్ వ్యవహారంతోనూ నరేష్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, నటి పవిత్ర లోకేష్ తో నాలుగో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు నరేష్ ని ఒక రేంజిలో ఏసుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చరిత్రలోనే అత్యంత విలువలేని, ఓ పనికి మాలిన ప్రెసిడెంట్ నరేష్ అని నాగబాబు వ్యాఖ్యానించారు. నరేష్ పరిశ్రమకి భారంగా మారాడు. ప్రతి ఇష్యూకి ప్రెస్ మీట్ పెట్టి గొడవ చేయటం.. పబ్లిక్ లో చెప్పలేని విషయాలని కూడా బయటపెట్టేవాడు అంటూ నాగబాబు ఫైర్ అయ్యాడు. తాజాగా జనసేన పార్టీ కార్యక్రమాలపై మాట్లాడుతూ నరేష్ ఇష్యూపై స్పందించాడు నాగబాబు.

నరేష్ కి అదో రకమైన మానసిక జబ్బు ఉందంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు. అయితే మా ఎన్నికలు అయిపోయి ఏడాది అయ్యాకా.. అకారణంగా తనపై విమర్శలు చేస్తున్నాడని నాగబాబుకు నరేష్ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కమెడియన్ అలీతో ‘అందరు బావుండాలి అందులో నేను ఉండాలి’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు నరేష్. ఈ సినిమాకి సంబదించిన ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ.. మెగా ఫ్యామిలీ మొత్తంలో పనిపాట లేక తిరిగేది ఒక్క నాగబాబే అంటూ నరేష్ సీరియస్ అయ్యారని.. బేవార్స్ గా తిరిగే తమ్ముడికి చిరంజీవి గారు సినిమా అవకాశాలు ఇచ్చినా సరిగ్గా వినియోగించుకోలేదని.. ప్రస్తుతం కూడా పని లేని నాగబాబుకి జనసేన ఆఫీసులో పవన్ కళ్యాణ్ ఎదో జాబ్ ఇచ్చాడంటూ నాగబాబుపై నరేష్ వ్యంగ్యంగా సెటైర్స్ వేసినట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.