war started in American politics
mictv telugu

మళ్ళీ మొదలు

January 4, 2023

war started in American politics

రెండేళ్ళుగా హాయిగా ఉన్న అమెరికా ప్రభుత్వంలో మళ్ళీ ఆట మొదలైంది. ఇన్నాళ్ళు జో బైడెన్ ఏకపక్షంగా అన్నీ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇకపై దానికి అడ్డుకట్ట పడనుంది. ఆదేశ కాంగ్రెస్ లోని కీలకమైన ప్రతినిధుల సభ ఈరోజు నుంచి మాజీ అధ్యక్షెడె డొనాల్డ్ ట్రంప్ చేతిలోకి వచ్చేస్తోంది.

ట్రంప్ ఓటమి తర్వాత రిపబ్లికన్ సార్టీ చాలా కామ్ అయిపోయింది. ట్రంప్, ఇంకా మరికొందరు లీడర్ల మీద ఆరోపణలు రావడం కూడా దీనికి కారణం. అయితే కొన్ని రోజుల క్రితం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సెనెట్ లో డెమోక్రాట్లకు, ప్రతినిధుల సభలో రిపబ్లికన్ లకు ఆధిక్యం లభించింది. అమెరికా పార్లమెంట్ లో ీ రెండు సభలూ కీలకమైనవే. కొన్ని నిర్ణయాలు సెనెట్ లో తీసుకుంటే, మరికొన్ని నిర్ణయాలు ప్రతినిధుల సభలో ఆమోదం పొందవలసిందే. ఇప్పడు ప్రతినిధుల సభ రిపబ్లి కన్ గెలుపుతో మళ్ళీ చురుకుగా తయారయింది. మరో రెండేళ్ళల్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇప్పడు దీన్ని అవకాశంగా తీసుకుని పార్టీని బలంగా చేయాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు.

ఇన్నాళ్ళు ట్రంపం మాట కానీ, రిపబ్లికన్ల మాట కానీ ఎక్కడా చెల్లలేదు. ఇప్పడు ఈ రెండేళ్ళల్లో బైడెన్ నిర్ణయాల మీద చెక్ పడనుంది. ఉక్రెయిన్ తో సంబంధాలపై కూడా ప్రతినిధుల షబలో విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి. బైడెన్ మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెడతామని కొంతమంది రిపబ్లికన్లు ఇప్పటికే ప్రకటించారు కూడా. రెండేళ్ళుగా తమ మీద విచారణలు, దర్యాప్తులతో విరుచుకుపడుతున్న బైడెన్ కు అడ్డుకట్ట వేయాలని రిపబ్లికన్ లు తహతహలాడుతున్నారు. అయితే మళ్ళీ ఇందులో కొందరు ట్రంప్ ను వ్యతిరేకించే గ్రూప్ ఉంది. మరి వాళ్ళు దీన్ని ఎలా సమర్ధిస్తారో చూడాలి. ఉక్రెయిన్ కు సాయం చేయడం మీద మాత్రం రిపబ్లికన్ లు తీవ్రంగా వ్యతిరేకం వ్యక్తం చేయనున్నారు. అమెరికాను అప్పుల్లోకి నెట్టి ఉక్రెయిన్ కు ఖాళీ చెక్ మీద సంతకం పెట్టి ఇవ్వడం ఏంటన్నది రిపబ్లికన్ల వాదన. దీన్నే ప్రధానాంశం గా తీసుకుని రాబోయే ఎన్నికల్లో ప్రచారం కూడా చేయాలని రిపబ్లికన్లు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రానున్న రెండేళ్ళు అమెరికా రాజకీయాలు రంజుగా మారనున్నాయి.

అమెరికాలో ప్రతినిధుల సభను మన లోక్ సభతో పోల్చుకోవచ్చు. సెనేట్ ను రాజ్య సభగా చెప్పాలి. ఈ రెండింటిని కలిపి వారు అమెరికన్ కాంగ్రెస్ గా పిలుచుకుంటారు. ప్రతినిధుల సభ బిల్లులను రూపొందిస్తే ఆ చట్టాలను సెనేట్ ఆమోదించవచ్చు లేదా నిరోధించవచ్చు. అమెరికా అధ్యక్షుడు చేపట్టిన నియామకాలను సెనేట్ సాధారణంగా ధ్రువీకరిస్తుంది. వాటిపై అధ్యక్షుడిని నిలదీసే అధికారం కూడా సెనేట్ కు ఉంది. కానీ, అలాంటి సందర్భాలు చాలా అరుదు. అమెరికాలో యాభై రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరేసి సెనేటర్లు చొప్పున ఆరేండ్ల పదవీ కాలానికి ఎన్నికవుతారు. అంటే, మొత్తం100 మంది సెనేటర్లు ఉంటారు. ప్రతినిధుల సభలో మొత్తం 435 మంది సభ్యులుంటారు. ఇక ప్రతినిధుల పదవీ కాలం రెండేండ్లు. వారు చిన్న జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. అధ్యక్షుని పదవీ కాలం నాలుగేళ్లు కాగా మధ్యలో రెండేండ్ల కొకసారి జరిగే కాంగ్రెషనల్ ఎన్నికలను వాళ్లు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని పిలుచుకుంటారు.