టెక్స్ టైల్ పార్క్ కు పునాది వేయనున్న కేసీఆర్... - MicTv.in - Telugu News
mictv telugu

టెక్స్ టైల్ పార్క్ కు పునాది వేయనున్న కేసీఆర్…

August 12, 2017

వరంగల్ లో టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపనకు ముహూర్తం ఓకే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ నుంచి హైదరబాద్ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. మెదటి అడుగుగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్

వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట, సంగెం మండలంలోని చింతలపల్లి ఊళ్ల మధ్య టెక్స్ టైల్ పార్కును కట్టనున్నారు. పార్క్ కోసం ఇప్పటీకే 1190 ఎకరాలను సేకరించారు. మెుత్తం 1150 కోట్లతోటి ఏర్పాటు చేయనున్నారు. పార్క్ నిర్మాణాకి పర్యావరణ అనుమతులు కూడా లభించడంతో పనులు మరింత వేగవంగా చేస్తామంటోంది TSIIC. అటు ప్రాజెక్టుల పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు వచ్చాయని ప్రభుత్వ చెబుతోంది. 11వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే చాన్సుందని అధికారులు చెబుతున్నారు. టెక్స్ టైల్ పార్క్ తో లక్ష మందికి పైగనే ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉద్యోగ , ఉపాధి అవకాశాలు పొందనున్నారు .ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన నేత కార్మికులను తిరిగి రప్పించి టెక్స్ టైల్ పార్క్ లో ఉపాధి కల్పిస్తామంటుంది రాష్ట్ర సర్కార్.