కేంద్ర ప్రభుత్వం గురువారం స్వచ్ఛతా అవార్డులను ప్రదానం చేసింది. స్వచ్ఛత విషయంలో ఉత్తమ పనితీరు కనబర్చిన విద్యాసంస్థలకు, మోడల్ గ్రామాలను తీర్చిదిద్దిన జిల్లా కలెక్టర్లకు ఈ అవార్డులు అందజేసింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ అర్బన్ జిల్లాలో శంభునిపల్లి గ్రామాన్ని, స్వచ్ఛత పాటించడంలో ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు కలెక్టర్ అమ్రపాలికి అవార్డు వచ్చింది. ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అవార్డులు అందజేశారు.