ఒక్కడు 9 మందిని చంపాడా? పోలీస్ వెర్షన్‌పై మక్సూద్ బంధువుల డౌట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కడు 9 మందిని చంపాడా? పోలీస్ వెర్షన్‌పై మక్సూద్ బంధువుల డౌట్

May 26, 2020

vhbnv bn

సంచలనం సృష్టించి వరంగల్ గొర్రెకుంట బావి హత్యల కేసును ఛేదించామని, బిహార్ యువకుడు సంజయ్ కుమార్ ఒక హత్యను దాటి పెట్టడానికి 9 మందిని చంపాడని పోలీసులు చెప్పడం తెలిసిందే. అయితే ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదని హతుడు మక్సూద్ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వారు పశ్చిమ బెంగాల్ నుంచి ఈ రోజు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, హత్యల వెనుక మరికొందరి హస్తం ఉండొచ్చని పేర్కొన్నారు. ‘సంజయ్ అంతమందికి విషం పెట్టి చంపేశాడా? అందర్నీ మోసుకెళ్లి బావిలో ఎలా పడేశాడా? ఏం జరిగిందో మాకు తెలియదు. సంజయ్ తోపాటు మరికొందరు కలసి చంపి ఉండొచ్చు. మక్సూద్ కు సంజయ్ పై అనుమానం ఉందని చెబుతున్నారు. మరి అలాంటి వాడితో ఎందుకు చనువుగా ఉంటారు? లోతుగా దర్యాప్తు జరిపించి మాకు న్యాయం చేయాలి.. ’ అని కోరారు. 

మక్సూద్ మరదలు రఫికాతో సంబంధం కొనసాగించిన సంజయ్ ఆమె కూతురుపైనా కన్నేశాడని, ఆమెను అడ్డు తొలగించుకోడానికి రైల్లో తీసుకెళ్లి చంపేశాడని, ఆ విషయం బయటికి రాకుండా మక్సూద్ కుటుంబాన్ని కూడా అంతమొందించాడని పోలీసులు చెబుతున్నారు.