వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. మద్యానికి బానిసై, నిత్యం తమను వేధిస్తున్న కొడుకును తల్లిదండ్రులే చేతులు కట్టేసి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. దామెర మండలం ముస్తాలపల్లికి చెందిన మహేశ్ చంద్ర(42) తాగుడుకు బానిస. భార్య రెండు నెలల కిందట అతణ్ని వదిలేసి పుట్టింటికి పోయింది. తర్వాత మహేశ్.. తల్లిదండ్రులపై వేధింపులకు పాల్పడ్డాడు. మద్యం కోసం డబ్బు ఇవ్వాలని వేధించాడు. అతని ఆగడాలు శ్రుతి మించడంతో తల్లిదండ్రులు విమల, ప్రభాకర్.. కిరోసిన్ పోలి కాల్చేశారని స్థానికులు చెప్పారు. చేతులు కట్టేసి ఈ దారుణానికి తెతబడ్డారని తెలిపారు. మృతుడికి ఇంటర్ చదువుతున్న కూతురు, ఏడో తరగతి చదివే కొడుకు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మహేశ్ తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.