వరంగల్ మార్కెట్లో తల, మొండేన్ని వేరుచేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్ మార్కెట్లో తల, మొండేన్ని వేరుచేసి..

April 23, 2018

నేరాలకు అంతులేకుండా పోతోంది. పగలు, ప్రతీకారాలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కొందరికైతే తమ ప్రత్యర్థులను చంపిన తర్వాత కూడా కక్ష తీరక మృతదేహాలను ఛిద్రం చేస్తున్నారు. వరంగల్‌ నగరంలోని ఎనుమాముల మార్కెట్‌లో దారుణం వెలుగు చూసింది.తైదల సాంబయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. తర్వాత తల, మొండేన్ని వేరు చేసి, మొండేన్ని గోనె సంచిలో పెట్టి మార్కెట్‌ గేటు ఎదురుగా పడేసి పోయారు. తల మరోచోట దొరికింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను పరిశీలించారు. రౌడీల మధ్య గొడవే సాంబయ్య హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. సాంబయ్యతో గతంలో ఘర్షణకు దిగిన పత్రి కుమార్‌ ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.