వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట బావి కేసులో కీలక తీర్పు వెలుబడింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌కు మరణశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన జయ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ శిక్ష ఖరారు చేసింది. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది మే 21న గొర్రెకుంటలోని ఓ ఫ్యాక్టరీ వద్ద పని చేసుకుంటూ ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన తొమ్మిది మందిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఆహారంలో విషం కలిపి వారంతా మత్తులోకి వెళ్లగానే సజీవంగానే బావిలో పడేశాడు. కార్మికులు ఎవరూ కనిపించకపోవడంతో ఫ్యాక్టరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టారు. వారంతా బావిలోనే చనిపోయి కనిపించడంతో ఆరా తీయగా సంజయ్ పనిగా తేలింది. వివాహేతర సంబంధం కోణంలో ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు అంత మందిని చంపాడు. దీనిపై విచారణ వేగం పెంచారు. 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు. 57మంది మంది వాంగ్మూలం నమోదు చేయడంతో ఈ తీర్పు వెలుబడింది.