ఒంటిపై ఖాకీ బట్ట ఉంది కదా అని కొందరు దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు. ప్రజలను కాపాడాల్సింది పోయి వారినే కాటేస్తున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ పోలీస్ స్టేషన్ సీఐ దయాకర్ ఆగడాలు శ్రుతిమించాయి. దీంతో అతనిపై దారి దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అతను పనిచేసే స్టేషన్లో ఈ కేసులు పెట్టారు.
భూవివాదంలో దయాకర్ ఓ వ్యక్తిని చంపుతానని తుపాకీతో బెదిరించాడు. చిత్రహింసలు కూడా పెట్టాడు. దీంతో బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సీపీ ప్రమోద్ కుమార్ అంతర్గత విచారణ జరిపించు. విచారణలో దయాకర్ అక్రమాలను గుర్తించారు. అతనిపై హత్యాయత్నం, దారిదోపిడీ కేసులు నమోదు చేయించారు. అతణ్ని సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే అతనిపై సస్పెన్షన్, ఉద్యోగం నుంచి తొలగింపు వచ్చి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రెండు రోజులు ఆగితే అంతా మర్చిపోతారని, అందుకే పోలీసులు తమ నిందితులను కాపాడుకోవడం మామూలేనని బాధితులు అంటున్నారు.