ఆయిల్, గ్యాస్ కంపెనీ అయిన ఇండేన్ సరికొత్త సిలిండర్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మామూలుగా ఇప్పుడు మనం వాడుతున్న గ్యాస్ సిలిండర్లు అప్రమత్తంగా లేకపోతే పేలిపోతాయి. గ్యాస్ లీకై ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. దీంతో చాలా జాగ్రత్తగా సిలిండరును వాడాల్సి వచ్చేది. ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ కంపెనీ ఎప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ పేలని సిలిండర్ను రూపొందించింది. బ్లాస్ట్ ప్రూఫ్ పద్ధతిలో రూపొందించిన ఈ కొత్త సిలిండర్లో పది కిలోల గ్యాస్ వస్తుంది. ఇంతకు ముందు ఉన్న సిలిండర్లతో పోలిస్తే కొంత తక్కువే అయినా భద్రతతో పాటు రేటు కూడా అందుకనుగుణంగానే ఉంటుంది. కొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ సిలిండర్ను కంపెనీ సోమవారం వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి గారిచే ఆవిష్కరించింది.