వరంగల్ లో నకిలీ 2 వేల నోట్ల కలకలం.. 6 లక్షలు స్వాధీనం - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్ లో నకిలీ 2 వేల నోట్ల కలకలం.. 6 లక్షలు స్వాధీనం

November 18, 2022

వరంగల్ లో దొంగ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 6 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఏడు సెల్ ఫోన్లు, రెండు బైకులతో పాటు నకిలీ కరెన్సీ తయారు చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ కమిషనర్ సీపీ తరుణ్ జోషీ మీడియాకు తెలిపారు. నిందితులు సయ్యద్ యాకూబ్ అలియాస్ షకీల్, గడ్డవ ప్రవీన, గుండా రజనీలుగా గుర్తించినట్టు వెల్లడించారు.

వీరంతా గతంలో ఓ కిడ్నాప్ కేసులో రామగుండం జైలులో శిక్ష అనుభవించారని అక్కడే దొంగ నోట్లు ముద్రించే వారితో పరిచయం అయినట్టు వివరించారు. వారితో పరిచయం పెంచుకొని యూట్యూబ్ సాయంతో నకిలీ నోట్ల ముద్రణ ప్రారంభించారన్నారు. వీటిని రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లు, కిరాణా షాపులు, బట్టల షాపులు, కొంత వరకు వైన్ షాపుల్లో చలామణి చేసేవారని పేర్కొన్నారు.