సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా కొన్ని మూఢనమ్మకాలు జనాలలో అలాగే ఉండిపోతున్నాయి. కొందరు చేతబడులు, క్షుద్రపూజలు చేస్తామని చెప్పి అమాయకులను వలలో వేసుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అలాంటి ఘటన చోటుచేసుకుంది. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో పోలీసులు పూజలను భగ్నం చేసి ఓ హిజ్రాతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రోడ్డుపై ఉన్న నిమ్మకాయలు, కోడిగుడ్డు, కొబ్బరి బోండాలను అందరూ చూస్తుండగానే నారాయణ అనే హోంగార్డు వాటిని తినేశాడు. ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.