గొర్రెకుంట సంజయ్.. రఫీకా కూతురిపై అత్యాచారం, గర్భం - MicTv.in - Telugu News
mictv telugu

గొర్రెకుంట సంజయ్.. రఫీకా కూతురిపై అత్యాచారం, గర్భం

June 5, 2020

Warangal Well Case New Angles

వరంగల్ జిల్లా గొర్రెకుంటలో సంచలనం సృష్టించిన వలస కూలీల హత్య కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సంజయ్‌ని పోలీసులు విచారించగా కీలక విషయాలను వెల్లడించాడు. దీంతో అతనిపై మరో రెండు కేసులు నమోదు చేశారు. ఇంకా ఇలాంటి ఘటనలకు ఏమైనా పాల్పడ్డాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. 10 మందిని చంపిన నిందితుడి గత నేరాలపై పోలీసులు దృష్టిపట్టగా.. పోలీసులకు విస్తుపోయే నిజాలను చెప్పాడు. 

గత నెల 30న పోలీసులు ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ క్రమంలో విచారణలో తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న రఫీకా కుమార్తె పై కూడా అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పాడు. 14 ఏళ్ల మైనర్ బాలిక అని కూడా చూడకుండా పలుమార్లు అఘాత్యానికి ఒడిగట్టినట్టు తేల్చారు. ఆమెకు పరీక్షలు చేయగా.. అప్పటికే గర్భం దాల్చినట్టు తేలింది. దీంతో సంజయ్‌పై ఫోక్సో చట్టం కింద రెండు కేసులు నమోదు చేశారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చార్జిషిట్ వేస్తామని అంటున్నారు. కాగా గత నెలలో గొర్రెకుంటలో బిహార్,పశ్చిమ బెంగాల్‌కు చెందిన 9 మంది వలస కూలీలకు మత్తు మందు ఇచ్చి వారిని ఓ బావిలో పడేసి హత్య చేసిన సంగతి తెలిసిందే.