గతంలో మురళితో గొడవ పడిన ఏ-4 రాజేందర్ రెడ్డి... - MicTv.in - Telugu News
mictv telugu

గతంలో మురళితో గొడవ పడిన ఏ-4 రాజేందర్ రెడ్డి…

July 20, 2017

వరంగల్ టిఆర్ఎస్ కార్పొరేటర్ మురళి హత్య కేసులో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఏ-4 నిందితుడు. రాజకీయంగా దెబ్బతీసేందుకే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారని ఆరోపించారు. అంతే కాదు మురళి తమకు మంచి స్నేహితుడి అని చెప్పాడు..కానీ ఈ వీడియా చూస్తే అలా అన్పించడం లేదు. వీరి మధ్య గతంలో పలుమార్లు గొడవ జరిగింది. దానికే ఈ వీడియోనే సాక్ష్యం..

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ 44వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ మురళి గురువారం హత్యకు గురయ్యారు. ఆరోజు సాయంత్రం ఆయన్ను ఇంట్లోనే ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆ తర్వాత హత్యాయుధాలను దారి పొడవునా గాల్లో తిప్పుతూ బైకులపై హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. అరెస్టయిన ముగ్గురు నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ముగ్గురు కాంగ్రెస్‌ నాయకులు నాయిని రాజేందర్‌రెడ్డి, శ్రీమాన్‌, శేఖర్‌ పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

https://www.facebook.com/mictv.in/videos/322189974906180/