ఏపీ వాహనదారులకు హెచ్చరిక..రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ వాహనదారులకు హెచ్చరిక..రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి

June 15, 2022

ఏపీ వాహనాదారులకు జగన్ సర్కార్ ఓ హెచ్చరికను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సూమారు 1.5 కోట్ల వాహనాలు ఉండగా, అందులో సగం వాహనాలకు మాత్రమే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై బైక్, ఆటో, కారు, లారీలతోపాటు అన్నీ వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లును తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

”2014 సంవత్సరం నుంచి ఏపీలో కొత్త వాహనాలకు రవాణాశాఖ హై సెక్యూరిటీ ప్లేట్లు బిగిస్తోంది. ఇకపై అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పకుండా ఉండాల్సిందే. పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల బిగింపును తప్పనిసరి చేస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెంబర్ ప్లేట్ల ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనుంది.”

ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోట్ల వాహనాలు ఉంటే, అందులో సగం వాహనాలకు మాత్రమే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఉన్నాయట. ఇంకా 75 లక్షల వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేవట. ఇకపై హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు రోడ్లపై తిరిగితే, రూ. వెయ్యి జరిమానాను విధించాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారట. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేని 75 లక్షల వాహనాలను గుర్తించి, ఆ వాహనాలకు నెంబర్ ప్లేట్లను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట. వాహనాదారులు ఈ విషయాన్ని గుర్తించి మీ వాహనాలకు హై సెక్యూరిటీ ప్లేట్లు లేకపోతే వెంటనే అప్రమత్తమై, ప్రభుత్వ నిబంధలన ప్రకారం పేట్లును అమర్చుకోవాలని హెచ్చరించారు.