బీరు ప్రియులకు హెచ్చరిక.. బీరు తాగితే - MicTv.in - Telugu News
mictv telugu

బీరు ప్రియులకు హెచ్చరిక.. బీరు తాగితే

May 2, 2022

దేశవ్యాప్తంగా బీర్ల విక్రయాలు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు. వేసవి సందర్భంగా చల్లని బీరు త్రాగితే ఆరోగ్యానికి మంచిదని యువత బీర్లకు బానిసలు అవుతున్నారని, ఈ కారణంగా ఎక్కువ మంది స్థూలకాయులుగా మారుతున్నారు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బీరు త్రాగటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని పలు సంచలన విషయాలను వెల్లడించారు.” బీరు తాగితే, నాడీ వ్యవస్థపై ఆల్కహాల్ ప్రభావం విపరీతంగా పడుతుంది.సెరబెలామ్‌పై దుష్ ప్రభావం పడి, శరీర కదలికల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఆల్కహాల్ ప్రభావంతో మెదడులో ఆలోచనాశక్తి తగ్గిపోతుంది. కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంటుంది.

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారు ఎదైనా అనారోగ్యానికి గురైతే, వారు వాడే మందులు ఏమాత్రం పనిచేయవు. రక్తపోటు ఉన్న వారిలో మిథైల్ డొపిన్ వంటి బీపీ మాత్రలపై ఆల్కహాల్ ప్రభావం తీవ్రంగా పనిచేస్తుంది. బీపీ స్థాయి పెరిగి, గుండె స్పందన తగ్గుతుంది” అని చెప్పారు.

మరోపక్క ఒక్క బీరులో 650 మిల్లీ లీటర్ల ఆల్కహాల్ ఉంటుందట. 5-1.5 శాతం బ్రాందీ, విస్కీలలో 42.8 శాతం, వైన్‌లో 6-24 శాతం వరకూ ఆల్కహాల్ ఉంటుందట. బీరే కదాని పుల్‌గా తాగితే, ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందట. రోజుకు 90 ఎంఎల్ కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే, అది కాలేయంపై ప్రభావం చూపి, కాలేయం పరిమాణం కుంచించుకుపోయి పనితీరు దెబ్బతింటుందట. దీన్నే లివర్ సిర్రోసిస్ అని పిలుస్తామని వైద్యులు చేప్తున్నారు. కావున మద్యం ప్రియులు, యువత బీర్లను అధికంగా తాగటం ఆపితే, ఆరోగ్యం మంచిగా ఉంటుదని యువతకు సూచనలు చేశారు.