వాహనదారులకు హెచ్చరిక.. దొరికితే 300 రెట్లు చెల్లించాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

వాహనదారులకు హెచ్చరిక.. దొరికితే 300 రెట్లు చెల్లించాల్సిందే..

June 5, 2022

తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పన్నులు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్న వాహనదారులు కర్మఖాళీ పోలీసులకు దొరికితే, 300 రెట్లు వరకూ పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రవాణ శాఖ అధికారులు వేట మొదలు పెట్టారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి, వాహనాలను భారీగా తనిఖీలు చేస్తున్నారు.

ఈ తనిఖీలలో భాగంగా పోలీసులు.. ఓవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తూ, మరోవైపు పత్రాలు లేకుండా వాహనాలను నడుపుతున్న వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన పత్రాలు లేని వాహనదారులపై చెల్లించాల్సిన దానికంటే మూడు వందల రెట్లు అధికంగా జరిమానాలను విధిస్తున్నారు. ఈ నెలలోనే విద్యా సంస్థలు తెరవటం, రైతులు విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేసే సమయం రావడంతో రోడ్లపై సరైనా పత్రాలు లేకుండా తిరిగే ఆటోలకు, బైక్‌లకు, కార్లకు, ట్రాక్టర్లకు పోలీసులు భారీ జరిమానాను విధిస్తున్నారు.

నల్గొండ జిల్లా ఆర్డీవో సురేశ్ రెడ్డి మాట్లాడుతూ..”ప్రభుత్వం రోడ్డు పన్ను రద్దు చేసింది. మిగిలిన అన్ని రకాల పన్నులు చెల్లించాల్సి ఉంది. ప్రతి వాహనదారుడు వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఫిటెనెన్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, కాలుష్య పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. వాటిని నిర్ణీత గడువులోపు రెన్యూవల్ చేయించుకోవాలి. కానీ, పన్నులు చెల్లించాల్సి ఉండటంతో వాహనాదారులు రెన్యూవల్ చేయించుకోకుండా వాహనాలను తిప్పుతున్నారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే రవాణేతర (నాన్ ట్రాన్స్ పోర్ట్) వాహనాలు 5,12,052 ఉన్నాయి. నాన్ ట్రాన్స్ పోర్టు వాహనాలు 49,650 పన్నులు చెల్లించాల్సి ఉండగా, 22,055 వాహనాల ఇంతవరకు పన్నులు చెల్లించలేదు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు చెల్లించకుండా ఇలాంటి వాహనాలు ఎన్ని ఉన్నాయో లెక్కల్లో చెప్పలేము’ అని ఆయన అన్నారు.