పోలీసులకు వార్నింగ్.. ఎంఐఎం నేత అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులకు వార్నింగ్.. ఎంఐఎం నేత అరెస్ట్

April 6, 2022

ktr

హైదరాబాద్‌ నగరం భోలక్‌పూర్‌లో సోమవారం అర్ధరాత్రి పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన భోలక్‌పూర్‌ కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలసులు బుధవారం కాసేపటి క్రితమే కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు గౌస్ ఉద్దీన్ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు దీనిపై యాక్షన్ తీసుకోవాలని ముక్తకంఠంతో కోరారు. దీంతో ఆ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ గౌస్ ఉద్దీన్‌పై ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టవద్దని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ‘‘డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తెలంగాణలో ఇలాంటి మూర్ఖత్వాలను సహించవద్దని, రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని అభ్యర్థిస్తున్నా’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ముషీరాబాద్ పోలీసులు కార్పొరేటర్ గౌస్ ఉద్దీన్‌ను అరెస్ట్ చేశారు.