ప్రజలకు హెచ్చరిక.. ఆరెంజ్ అలర్ట్ జారీ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజలకు హెచ్చరిక.. ఆరెంజ్ అలర్ట్ జారీ

March 31, 2022

bcb

వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోయిందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస రావు తెలిపారు. గురువారం ప్రజారోగ్య శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందని వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువుంటున్నాయని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరించారు. వడదెబ్బ తగిలిన వారిని ప్రాథమిక సపర్యల అనంతరం ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు. నిత్యం బయట ఉంటూ విధులు నిర్వర్తించేవారు ద్రవ పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలని వివరించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉంచినట్లు, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, గర్భిణీలు బయటకు రావొద్దని, మంచి ఆహారం తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.