తాగుబోతు రిమ్మ…  పోలీసులకే వార్నింగ్  ఇచ్చాడు. - MicTv.in - Telugu News
mictv telugu

తాగుబోతు రిమ్మ…  పోలీసులకే వార్నింగ్  ఇచ్చాడు.

September 24, 2018

మద్యం తాగినవాళ్లు ఏం చేస్తారు. వారికి ఎవరిమీద కోపం  ఉంటుందో వారితో గొడవ పెట్టుకుంటారు. లేకపోతే సైలెంట్‌గా వెళ్లి నిద్రపోతారు. కానీ మద్యం మత్తులో ఓ యువకుడు ఏకంగా పోలీసులకే ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా పోలీసులకే వార్నింగ్  ఇచ్చాడు. దీంతో అతగాడిని పట్టుకున్న పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మద్యం సేవించినప్పుడు ఎక్కువగా అస్సలు మాట్లాడకూడదని అంటారు. ఆ సమయంలో ఎక్కువగా మాట్లాడితే గొడవలు అవుతాయని అంటారు. కానీ కొందరికి తాగి అది దిగేంత వరకు మాట్లాడుతూనే వుంటారు. ఇతను కూడా అదే బాపతు. కాకపోతే సొల్లు మాట్లాడేవారి కన్నా ఇతను ఒక మెట్టు ఎక్కువ ఎక్కాడు.  Warning was given to police. The police caught him in the jailబిహార్‌లోని బిట్హా గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ అనే యువకుడు ఫూటుగా మందు కొట్టాడు. అనంతరం బుద్దిగా నిద్రపోకుండా  పోలీస్ అధికారి రంజిత్ కుమార్ సింగ్‌కు ఫోన్ చేశాడు. అతనిపై విరుచుకుడి బండ బూతులు తిట్టాడు. తనతో పెట్టుకోవద్దని, పెట్టుకుంటే మటాషే అని వార్నింగ్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా మరో పోలీస్ అధికారికి ఫోన్ కలిపి మరింత చెలరేగిపోయాడు. పట్నాకు చెందిన ఎస్ఎస్‌పీ మను మహారాజ్‌కు ఫోన్ చేసి పూనకం వూగినంత పని చేశాడు. అవతల అధికారి  ఫోన్ ఎత్తగానే అసలేం అనుకుంటున్నావ్? టూఊఊఊ…. అంటూ బూతుపురాణం మొదలుపెట్టాడు.

దీంతో పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. ఆలస్యం చెయ్యకుండా అయ్యగారి కోసం రంగంలోకి దిగారు. అతని ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి అరెస్టు చేసి,రిమాండ్‌కు తరలించారు. తాగిన రిమ్మ దిగిపోయాక నేను అన్నేసి మాటలన్నానా అని నాలుక కరుచుకుంటున్నాడట సదరు తాగుబోతుల వారు. ఒకసారి నాలుక జార్చుకున్నాక తిరిగి తప్పు అయిందంటే చెల్లుతుందా ? పోలీసులు వారి పని వారు చేసుకుపోతున్నారు.