40 ఏళ్ల కిందటే కరోనా కథ.. అదే ఉహాన్‌లో - MicTv.in - Telugu News
mictv telugu

40 ఏళ్ల కిందటే కరోనా కథ.. అదే ఉహాన్‌లో

February 17, 2020

COVID19 virus

కరోనా వైరస్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ క్రమంగా అనేక దేశాలకు పాకుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి 1770 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. మొత్తం రోగుల సంఖ్య 70,548కు చేరింది. ఇదిలా ఉంటే ఈ వైరస్ గురించి ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. 

తాజాగా చైనాలో కరోనా లాంటి వైరస్ రాకను ఓ రచయిత 39ఏళ్ళ క్రితమే అంచనా వేశారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. డీన్ కూన్ట్జ్ అనే రచయిత తన నవల ‘ది అయిస్ ఆఫ్ డార్క్‌నెస్’ లో ఇలాంటి వైరస్ గురించి ప్రస్తావించారని సమాచారం. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి ఈ నవలకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ వైరస్ మనుషులను చంపేందుకు సరైన ఆయుధమని, ఇది కేవలం మనుషుల శరీరంలో మాత్రమే బతుకుతుందని, బయటకు వస్తే కనీసం ఒక్క నిమిషం కూడా బతకదని ఆ నవలలో ఉంది. కరోనా వైరస్‌కు కారణమైన ఉహాన్ గురించే రచయిత అంత కచ్చితంగా ఎలా అంచనా వేయగలిగాడని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఎవరైనా తప్పుదోవ పట్టించేందుకు ఈ పని చేసి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.