Was he the cause of Umamaheswari's death?: Lakshmi Parvati
mictv telugu

ఉమామహేశ్వరి మరణానికి కారణం అతడే?: లక్ష్మీపార్వతి

August 4, 2022

టీడీపీ సృష్టికర్త, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన రోజు నుంచి ఈరోజు వరకు ఆమె మృతిపై అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఉమామహేశ్వరి ఆత్మహత్యకు కారణం.. చంద్రబాబే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమామహేశ్వరి నివాసానికి చంద్రబాబు వచ్చి వెళ్లిన రోజు నుంచి ఆమె రాసిన సూసైడ్ నోట్ కన్పిపించటం లేదని అన్నారు. కాసేపటిక్రితమే లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ..” ఉమామహేశ్వరి మృతి వ్యవహారం ఓ మిస్టరీలా ఉంది. దీనిపై సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలి. చంద్రబాబు రాయకపోతే నేనే సీబీఐకి లేఖ రాస్తా. ఉమామహేశ్వరి బాగా చదువుకున్న వ్యక్తి. ఆత్మహత్యకు పాల్పడేంత పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలో లేదు. ఉమామహేశ్వరితో చంద్రబాబు, లోకేశ్ ఆస్తికోసం గొడవ పడుతున్నారని, ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సూసైడ్ నోట్ కనిపించకుండా పోవడం మరిన్ని అనుమానాలను బలపోస్తుంది” అని ఆమె అన్నారు.

అంతేకాదు, ఎన్టీఆర్ మృతికి కారకుడైన చంద్రబాబును నమ్మి మోసపోతున్న నందమూరి కుటుంబీకులను చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి పట్టిన శని చంద్రబాబేనని, హరికృష్ణ మరణానికి కూడా చంద్రబాబే కారకుడని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరినే బలి తీసుకుంటున్నాడని తీవ్రంగా మండిపడ్డారు.