తాజ్ మహల్ గుడికాదు..  సమాధే..! - MicTv.in - Telugu News
mictv telugu

తాజ్ మహల్ గుడికాదు..  సమాధే..!

August 26, 2017

అందాల మందిరం తాజ్ మహల్ గుడి కాదని, సమాధి మాత్రమేనని భారత పురాతత్వ పరిశోధన సంస్థ(ఏఎస్ఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగ్రా కోర్టులో అఫిడవిట్ సమర్పించిది. తాజ్ మహల్ పరిసరాల్లో ఆ నిర్మాణానికి ముందు గుడి ఉన్న ఆనవాళ్లేమ తమకు కనిపించలేదని స్పష్టం చేసింది. తాజ్ మహల్ నిజానికి శివాలయం అని 2015లో ఆరుగురు లాయర్లు కోర్టుకెక్కారు. అక్కడ తేజో మహల్ పేరుతో శివాలయం ఉండేదని, తర్వాత షాజహాన్ దాన్ని కూలగొట్టి  తాజ్ మహల్ కట్టారని వాదించారు. తాజ్ మహల్ ను హిందూ ఆలయంగా పరిగణించి, అందులోకి హిందూ భక్తులను అనుమతించాలని, పూజా పునస్కారాలకు అనుమతించాలని కోరారు.

ఈ వివాదంపై అధ్యయనం చేసి వాస్తవాలు నివేదించాలని కోర్టు ఏఎస్ఐని ఆదేశిచింది. పరిశోధనలు జరిపిన తర్వాత ఆ సంస్థ లాయర్ల వాదనను తోసిపుచ్చింది. తాజ్ మహల్.. హిందూ ఆలయంగా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.