wash room should be clean and elegant
mictv telugu

బాత్రూం నీట్ గా ఉండాలంటే వీటిని ఫాలో అయిపోండి.

January 16, 2023

wash room should be clean and elegant

ఇల్లు అంటే….ఇంటి ముందు మండువా నుంచి గదులు, బాత్రూమ్ లు, పెరడు అన్నీ కలిపి అవుతుంది. కాబట్టి ఇల్లు నీట్ గా ఉండడం అంటే అన్నీ ఉండాలి. కానీ చాలా మంది ఇంటి అంతటినీ శుభ్రంగా ఉంచుకుంటారు కానీ బాత్రూమ్ లను ఉంచుకోరు. అలి లోపల ఉంటాయి కదా, వాటిని ఎవరూ చూడరు కదా అనుకుంటారు. కానీ ఇల్లు నీట్ గా ఉండడం ఎవరి కోసమో కాదు మనకోసం. మన ఆరోగ్యం, మన ప్రశాంతత కోసం. బాత్రూమ్ లో ప్రశాంతత ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా కానీ ఉండాలి. ఎందుకంటే మనం ఎలాంటి ఆలోచనలు, బాధలు లేకుండా ప్రశాంతంగా గడిపే చోటు బాత్‌రూమ్‌‌‌‌‌‌‌. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అలసట మొత్తం.. స్నానాల గదిలో ఒక రిఫ్రెషింగ్‌ బాత్‌తో మాయం అయిపోతుంది. అలాంటి బాత్‌రూమ్‌ను అందంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవాలని ఇంటీరియర్ నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు చాలా మందికి బాత్రూమ్ లో కూర్చుంటే ఆలోచనలు వస్తాయి. పుస్తకాలు చదువుతారు, న్యూస్ పేపర్లు చదువుతారు. అలాంటప్పుడు బాత్రూమ్ అన్నింటికంటే శుభ్రంగా, అందంగా ఉండాలి. అవునంటారా. మరి బాత్రూమ్ నీట్ గా ఉండాలంటే ఎలా ఉంచుకోవాలో చూద్దామా.

లుక్:

బాత్‌రూమ్‌ టైల్స్‌ సెలెక్షన్‌లో స్పెషల్‌ కేర్‌ తీసుకోవాలి. మరీ డార్క్‌ కలర్‌ టైల్స్‌ తీసుకుంటే.. బాత్‌రూమ్‌ చిన్నగా కనిపిస్తుంది. మీ స్నానాలగది విశాలంగా కనిపించాలంటే.. తెలుపు, లైట్‌ కలర్‌ టైల్స్‌ సెలెక్ట్‌ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మీ బాత్‌రూమ్‌కు ఎలిగెంట్‌ లుక్‌ వస్తుంది.

కర్టెన్స్:

షవర్ కర్టెన్స్ బాత్‌రూమ్‌ని లుక్‌ని మార్చేస్తాయి. చాలా మంది ప్లెయిన్‌ని వేస్తుంటారు. అలా కాకుండా.. ఇందులో గ్రాఫిక్స్‌తో కూడినవి వస్తున్నాయి. వీటిని వేయడం వల్ల బాత్ రూమ్‌లుక్ మారిపోతుంది. వీటి వల్ల స్నానం చేసినప్పుడు ఆ నీరంతా కూడా బాత్‌రూమ్‌‌లో మొత్తం పడకుండా ఉంటుంది. కాబట్టి ఓ సారి ట్రై చేసి చూడండి.

అద్దం:

బాత్‌రూమ్‌లో అద్దం కచ్చితంగా ఉండాలి. ఎట్రాక్టివ్‌ డిజైన్‌లో బాత్‌రూమ్‌ అద్దం ప్లాన్‌ చేసుకుంటే లుక్‌ మారిపోతుంది. అయితే దీనికి ఎంపిక చేసుకునే అద్దం డిజైన్, పరిమాణం విషయంలో మాత్రం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అద్దం చుట్టూ అందమైన స్టిక్కర్స్ లేదా తీగజాతి పూలను ఎరేంజ్‌ చేస్తే.. బాత్‌రూమ్‌ చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటుంది.

లైటింగ్: బాత్రూమ్ ఎప్పుడూ మంచి వెలుతురుతో ఉండేట్టు చూసుకోవాలి. గాలి కూడా వచ్చేట్టు ఉంటే బావుంటుంది, ఒకవేళ అలాంటి సదుపాయం లేకపోతే కనీసం లైటింగ్ మీద దృష్టి పెట్టాలి. బాత్రూమ్ కాస్త విశాలంగా కనిపించాలంటే లైటింగ్‌ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. గదిలో వెలుతురు ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్దగా అనిపిస్తుంది. లీనియర్ లైటింగ్‌ని ఉపయోగించడం వల్ల ఎలిగెంట్‌ లుక్‌ వస్తుంది.

అమరిక:

చాలా మంది బాత్‌రూమ్‌లో సబ్బులు, షాంపూలు.. చిందరవందరగా ఉంచుతుంటారు. ఇలా ఉంటే బాత్రూమ్ ఎంత ఎలిగెంట్ గా ఉన్నా అసహ్యంగా కనిపిస్తుంది. స్నానాల గదికి మంచి లుక్‌ ఇవ్వడానికి.. గోడకు చిన్న చిన్న షెల్ఫ్స్ ఏర్పాటుచేసి వాటి పైనే అవన్నీ అందంగా సర్దుకుంటే బాగుంటుంది.

పట్టా:

లాస్ట్ బట్ నాట్ లీస్ట్….కాలా పట్టాలు లేదా మ్యాట్ లు. స్నానాల గదిలో మ్యాట్‌ చాలా ముఖ్యం. ఇది అందాన్ని పెంచడమే కాకుండా ప్రభావవంతంగా కూడా ఉంటుంది. స్నానం చేసి పాదాలు తడిస్తే ఆ మరకకు ఇల్లంతా పాడైపోతుంది. అందుకే మాట్ తప్పనిసరి. డోర్‌ మ్యాట్‌ చాలా రకాలు దొరుకుతాయి కాబట్టి ఇన్నోవేటివ్‌గా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే బావుంటుంది.

మొక్కలు:

దీని గురించి కూడా చెప్పుకోవాలండోయ్. బాత్రూమ్ లో మొక్కలు ఉంటే ఆ ఫ్రెష్ నెస్సే వేరుగా ఉంటుంది. అక్కడ మొక్కలు ఎలా పెరుగుతాయి అనుకుంటున్నారా…ఇంటిలో పెరిగే మొక్కలు కొన్ని ఉంటాయి, వాటికి ఎండ అక్కరలేదు. అలాంటి వాటిని తీసుకొచ్చి పెట్టుకొవచ్చు. బాత్‌రూమ్‌లో మొక్కలు పెంచుకుంటే దాని లుక్‌ వెంటనే మారిపోతుంది. బాత్‌రూమ్‌లో మీరు స్పెండ్‌ చేసే టైమ్‌ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్రెష్‌ ఎయిర్‌ కూడా వస్తుంది.