Washington Sundar falls outside wide line to play unthinkable shot in 1st ODI vs New Zealand
mictv telugu

వాషింగ్టన్ సుందర్ సూపర్ బ్యాటింగ్..సూర్యకుమార్‌లా సిక్స్‌లు

November 25, 2022

 Washington Sundar falls outside wide line to play unthinkable shot in 1st ODI vs New Zealand

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో పలువురు కొత్త ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌తో అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు వన్డేలో ఆరంగ్రేటం చేశారు. సంజూశాంసన్‌, వాషింగ్టన్ సుందర్ వంటి యువఆటగాళ్లకి సైతం తుది జట్టులో అవకాశం దక్కింది.

ఇక టీంఇండియాలో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు. చివర్లో బ్యాటింగ్ లోకి వచ్చిన అతను దుమ్మురేపాడు. జట్టులో ముగ్గురు అర్థసెంచరీలు చేసిన సుందర్ బ్యాటింగ్ మాత్రం హైలెట్‌గా నిలిచింది. కేవలం 16 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. మూడేసి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. మాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్‌ 49వ ఓవర్‌లో సుందర్‌ విశ్వరూపం చూపించాడు. వరుసుగా 4,4,6 బాదాడు. ఇందులో ముఖ్యంగా ఐదో బంతికి కొట్టిన ఫోర్ మాత్రం సూపర్‌ షాట్‌గా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్‌ను తలపించేలా రిస్కీ షాట్ ఆడాడు. ఆఫ్‌ స్టంప్‌ ఆఫ్‌ సైడ్‌ వెళ్లున్న బంతిని ఫైన్‌లెగ్‌ మీదుగా స్కూప్‌ షాట్‌ ఆడి బౌండరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు చేసి వెనుదిరిగిన సూర్యకుమార్ యాదవ్ లోటును వాషింగ్టన్ సుందర్ భర్తీ చేశాడు. మొత్తానికి భారత్ 50 ఓవర్లలో 306 పరుగులు చేసింది.