వావ్..వాటర్ లాగే పైప్ లైన్ ద్వారా బీర్..! - MicTv.in - Telugu News
mictv telugu

వావ్..వాటర్ లాగే పైప్ లైన్ ద్వారా బీర్..!

May 31, 2017

ఇంట్లోకే వాటర్ లాగా బీర్ వస్తే ఎంత బాగుంటుందో….గ్లాస్ గ్లిసు లేకుండా నల్లాకే నోరుపెట్టేయొచ్చు. రాత్రి పగలు తేడాలేకుండా ఎప్పుడంటే అప్పుడు ట్యాప్ ఓపెన్ చేసుకోవచ్చు..ఇదీ మందుబాబుల ఫ్యూచర్ డ్రీమ్. ఇది అయ్యే పనేనా… అంటే అవుననే అంటున్నాడో జర్మనీవాసి.

జర్మనీలోని వాకెన్‌ పట్టణంలో ఏటా ఒపెన్‌ ఎయిర్‌ ఫెస్టివల్‌ను చేస్తుంటారు. స్థానికులు.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పచ్చటి పొలాల్లో ఎంజాయ్‌ చేస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల్ని ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో మద్యం కూడా ఒక భాగమే. అయితే బీరు.. ఇతర పానీయాలు తాగి ఖాళీ గ్లాసులను.. సీసాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దాంతో పచ్చని పొలాలు పాడైపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచించిన నిర్వాహకులకు ఓ ఐడియా. గ్లాసులు, సీసాలను అనుమతించకుండా పైపుల ద్వారానే బీరును సరఫరా చేయాలని డిసైడ్ అయ్యారట.
దీనికోసం పట్టణంలో నుంచి పొల్లాలోకి ఆరున్నర కిలోమీటర్ల మేర భూగర్భ పైపులైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆ పైప్‌లైన్‌ ద్వారా వేడుక జరిగే ప్రాంతానికి బీరు సరఫరా చేయబోతున్నారు. దీంతో వచ్చిన అతిథులు పైపు నుంచి బీరును పట్టుకొని తాగేయొచ్చు.ఒక్కో వ్యక్తి కనీసం 5 లీటర్ల బీరు తాగే అవకాశం ఉంది. అబ్బా… జర్మనీలాగే మనదగ్గర ఎవరైనా పైప్ లైన్ వేస్తే బాగుండు కదా…ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.
tags Beer pipe line/Germany