రక్తం కారినా ఆడాడు.. క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా - MicTv.in - Telugu News
mictv telugu

రక్తం కారినా ఆడాడు.. క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా

July 11, 2019

ఆస్ట్రేలియా క్రికెటర్ అలెక్స్ క్యారీకి బంతి తగిలి గడ్డం పగిలి గాయమైనా ఆటను విరమించుకోలేదు. కట్టు కట్టుకుని మరీ 70 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దీంతో అలెక్స్ అభిమానులు అతణ్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈరోజు వరల్డ్ కప్ రెండవ సెమీ ఫైనల్స్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే ఓపెనర్లు ఫించ్(0), వార్నర్ (9), హ్యాండ్స్‌కాంబ్‌(4) వికెట్లను కోల్పోయింది. దీంతో జట్టు నెగ్గుకురావడం కష్టంగా మారింది. 

అనంతరం స్మిత్, అలెక్స్ క్యారీల జోడీ పిచ్‌లోకి దిగి విజృంభించారు. బాగా ఆడి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బౌలర్ ఆర్చర్ వేసిన బంతి అలెక్స్ ముఖాన్ని బలంగా తాకింది. దీంతో అతని గడ్డం పగిలి రక్తం కారింది. అయినా అలెక్స్ వెన్ను చూపించలేదు. తలకు కట్టు కట్టుకునే మళ్లీ బ్యాటింగ్ చేశాడు. 70 బంతుల్లో 49 పరుగులు చేసి వహ్వా అనిపించాడు. అంత గాయం అయినా అలెక్స్ బ్యాటింగ్ చేయడంపై క్రికెట్ అభిమానులంతా అతనికి అభినందనలు తెలియజేస్తున్నారు. స్మిత్ (85), స్టార్క్ (29), మ్యాక్స్వెల్ (22) పరుగులు చేసి స్కోరును పెంచారు. మొత్తం మీద 49 పరుగులకు ఆలౌట్ అయిన ఆసిస్ జట్టు 223 పరుగులు నమోదు చేసింది.