బౌలర్‌కు తప్పిన ప్రమాదం..  - MicTv.in - Telugu News
mictv telugu

బౌలర్‌కు తప్పిన ప్రమాదం.. 

September 22, 2019

ఆటలో ప్రమాదాలు హఠాత్తుగా సంభవిస్తుంటాయి. అందుకే ఆటగాళ్లు ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. బ్యాట్‌మెన్ కొట్టిన బాల్ వచ్చి బౌలర్ తలకు తగలబోయింది. లక్కీగా అతను చేయి అడ్డం పెట్టడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. లేదంటే అతని తల పగిలిపోయేది. ఈ ఘటన ఆస్ట్రేలియా దేశీవాలీ వన్డే టోర్నీలో చోటు చేసుకుంది. న్యూ సౌత్ వేల్స్ వర్సెస్ క్వీన్స్ ల్యాండ్‌ల మధ్య దేశీవాలీ వన్డే టోర్నీలో మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిక్కీ ఎడ్వర్డ్స్ బాల్ విసిరాడు.. బ్యాట్స్‌మెన్ లాగిపెట్టి కొట్టాడు. అంతే ఆ బాల్ వేగంగా తనవైపుకు దూసుకురావడం గమనించిన ఎడ్వర్డ్స్ వెంటనే బాల్‌కు తన చేయి అడ్డం పెడుతూ కింద పడ్డాడు. దీంతో తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 

తన కుడిచేయికి తగిలిన బాల్ దెబ్బకు కొంత సేపటివరకు ఎడ్వర్డ్ గిలగిల కొట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎడ్వర్డ్స్ టీం పరాజయాన్ని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న న్యూ సౌత్ వేల్స్ 5వికెట్ల నష్టానికి 305పరుగులు చేసింది. బ్యాంటింగ్‌కు దిగిన క్వీన్స్ ల్యాండ్ 6వికెట్ల నష్టానికి 307పరుగులు చేయగలిగింది. ఫలితంగా క్వీన్స్ ల్యాండ్ 12బంతులు మిగిలి ఉండగానే 4వికెట్ల తేడాతో విజయం సాధించింది.