స్నేహితురాలితో కలసి బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ తలపై పెద్ద కొబ్బరికాయ పడింది. దీంతో ఆమె స్కూటర్ పైనుంచి రోడ్డుపై పడింది. హెల్మెట్ ధరించి ఉండటంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది కానీ లేదంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. మలేషియాలో ఈ సంఘటన జరిగింది. స్నేహితులైన ఇద్దరు మహిళలు ఆదివారం జలాన్ తెలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్‌కు స్కూటర్‌పై వెళ్తున్నారు. అయితే ఆ రోడ్డు పక్కనే ఉన్న ఒక కొబ్బరి చెట్టు పై నుంచి బాస్కెట్ బాల్ సైజులో ఉన్న కొబ్బరికాయ స్కూటర్‌పై వెనుక కూర్చొన్న మహిళపై తలపై నేరుగా పడింది.
దీంతో అదుపు తప్పిన ఆమె స్కూటర్ పైనుంచి రోడ్డుపై పడింది. వెంటనే స్కూటర్‌ను ఆపిన స్నేహితురాలితో పాటు , ఆ రోడ్డుపై వెళుతున్న వారు ఆమె వద్దకు పరుగున వచ్చారు.. గాయపడిన ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. ఆ కొబ్బరి చెట్లను నరికివేస్తామని అధికారులు హామీ ఇచ్చారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది.https://www.reddit.com/r/nevertellmetheodds/comments/vl68jd/a_coconut_fell_straight_on_a_bikers_head/?utm_source=share&utm_medium=web2x&context=3