మళ్ళీ అదే తంతు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మళ్ళీ అదే సీన్ రిపీట్ చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో అర్ధాంతరంగా వెళ్ళిపోవడం బైడెన్ కు అలవాటు. ఇప్పడు కూడా మరోసారి అదే పని చేశారు అమెరికా అధ్యక్షుడు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
విలేకరులు, పాత్రికేయులు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం చెప్పాపెట్టకుండా తలుపేసుకుని మరీ వెళ్ళిపోయారు. తనను కాదన్నట్టు వెనక్కి తిరిగి చూడకుండా బయటకు చెక్కేసారు. అసలు సంగతి ఏంటంటే అమెరికాలోని రెండు బ్యాంకుల్లో సంక్షోభం తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. దీని గురించి బైడెన్ మాట్లాడారు. తన బ్యాకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందంటూ భరోసా ఇచ్చారు. డిపాజిటర్ల డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ హామీలు కూడా ఇచ్చారు. కానీ దీని మీదనే మీడియా మరికొన్ని ప్రశ్నలు అడుగుతుంటే మాత్రం నోరు విప్పకుండా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయటకు వెళ్ళిపోయారు. ఇంతకీ మీడియా ఏం అడిగిందో తెలుసా… అసలు సంక్షోబం ఎందుకు తలెత్తింది అని? దాని మీద అమెరికా ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం ఉందని, తర్వాత జరిగే పరిణామాల మీద అమెరికన్లకు ఎలాంటి భరోసా ఇష్తున్నారని ప్రశ్నలు అడిగారు. అంతేకాదు మరికొన్ని బ్యాంకులకు కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందా అని కూడా అడిగారు. అయితే బైడెన్ మాత్రం దేనికీ సమాధానం ఇవ్వలేదు. అసలు ఆ ప్రశ్నలు తనను అడగలేదన్నట్టు బయటకు వెళ్ళిపోయారు, డోర్ లాక్ చేసుకుని మరీ.
బైడెన్ బయటకు వెళ్ళిపోయిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈయన ఇలా బయటకు వెళ్ళిపోవడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకు ముందు చైనా బెలూన్ సంఘటనప్పుడు, కొడుకు హంటర్ బైడెన్ విదేశీ వ్యాపారాలపై విమర్శలు వచ్చినప్పుడు కూడా ఇలానే విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా నాకు కొంచెం టైమ్ ఇవ్వండి అంటూ ఒకసారి, మరోసారి ఏం చెప్పకుండానే బయటకు వెళ్ళిపోయారు.
“Can you assure Americans that there won’t be a ripple effect? Do you expect other banks to fail?”
BIDEN: *shuts door* pic.twitter.com/CNuUhPbJAi
— RNC Research (@RNCResearch) March 13, 2023